Political landscape - Vishvambhara News

అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది. ఎన్డీయే కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నితీశ్‌కుమార్‌లు కీలకం కానున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడాలి.

ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వల్ల ఎవరైతే వేధించబడ్డారో వాళ్లు అందరూ ఇండియా కూటమిలో చేరుతున్నారని అన్నారు. చంద్రబాబును కూడా బీజేపీ వాళ్లు వేధించారని ఆరోపించారు. దీంతో ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

2014, 2019లో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఒంటరిగానే అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను బీజేపీ దక్కించుకుంది. పేరుకు ఎన్డీయేగా అధికారంలో ఉన్నా బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం సీన్‌ మారింది. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో 241 వద్దనే నిలిచిపోయింది. దీంతో అధికారంలోకి రావడానికి, ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా తీపై పవన్ కల్యాణ్ 50వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్‌ను ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్‌ను ఓడించటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. జనసేన 21 ఎమ్మెల్యే, 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజా ట్రెండ్స్ మేరకు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపు దిశగా వెళ్తోంది. 100శాతం స్ట్రైకింగ్ రేట్‌తో పవన్ విజయం సాధించారు.  ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రికార్డు అని చెప్పాలి.

రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. పవన్‌కు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.