pawankalyan - Vishvambhara News

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన సభల్లో ప్రసంగించనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రూపకల్పనలో పార్టీ నిమగ్నమైంది. త్వరలోనే ఆయన ఏయే పట్టణాల్లో ప్రచారం చేస్తారు, ఏ మార్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రానుంది. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో  బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ పర్యటన ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో తమ కూటమి బలాన్ని చాటాలని జనసేనాని భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్‌’ డబ్బింగ్‌ షురూ
విశ్వంభర, సినిమా బ్యూరో: పవర్ స్టార్ పవన్ ‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రానికి సంబంధించి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో వేగం పెంచింది. తాజాగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించింది. దర్శకుడు హరీశ్‌ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ట్యూన్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.

మార్చి 26న విడుదల?
ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.  తొలుత మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడే సూచనలు ఉండటంతో, అదే స్లాట్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ధురంధర్‌ 2’, ‘టాక్సిక్‌’, ‘ప్యారడైజ్‌’ వంటి భారీ చిత్రాల మధ్య ఈ సినిమా వస్తుందా లేదా అన్న సందిగ్ధతకు ‘పెద్ది’ వాయిదాతో తెరపడింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

హరీశ్ శంకర్ క్రేజీ పోస్ట్
చిత్ర దర్శకుడు హరీశ్‌ శంకర్ తన తాజా ఎక్స్‌ పోస్ట్‌తో అభిమానుల్లో జోష్ నింపారు. "సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి కారు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కారు వేసుకొని వస్తే.. అందులో ఉస్తాద్‌లోని 'కొత్త సాంగ్' ప్లే చేసుకుంటూ డ్రైవ్‌కు వెళ్దాం, అదే నా గిఫ్ట్" అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దీన్నిబట్టి రెండో పాట విడుదలకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు
విశ్వంభర బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు మత తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవాన్ని (షాహీదీ దివస్) పురస్కరించుకుని నిర్వహిస్తున్న భారీ ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గురుద్వారాలో ఆధ్యాత్మిక అనుభూతి
గురుద్వారాకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు సిక్కు మత పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సచ్‌ఖండ్ గురుద్వారా లోపల ఆయన మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు గురువులు ఆయనకు సిక్కు సంప్రదాయ వస్త్రాలను బహూకరించి ఆశీర్వచనాలు అందజేశారు. మానవత్వం, ధర్మ పరిరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మం, మానవ హక్కుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన గురువుల ఆశీస్సులు తీసుకోవడం అదృష్టమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రాజకీయ దిగ్గజాల సమక్షంలో..
నాందేడ్ చేరుకున్న పవన్ కల్యాణ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది. ఈ పర్యటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, భోకర్ ఎమ్మెల్యే శ్రీజయ చవాన్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ చారిత్రాత్మక వేడుక కోసం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు నాందేడ్ చేరుకున్నారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పవన్, జనసేన అభిమానులు దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తిట్టించే బదులు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం.. అందరినీ చంపేయండి..’’ అని అన్నారు.

‘‘మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్‌కు కట్టుబడి నా పేరు మార్చుకున్నా. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వెంటనే వారిని ఆపాలి. నేను చేతకాని వాడిని. అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని కోరాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నందున. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి’’ అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(శుక్రవారం), రేపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత మిగతా మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలంతా రేపు(శనివారం) స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.#PawanKalyanAneNenu #GameChangerPK pic.twitter.com/fNfdgbrmHG

— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 21, 2024

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, తాజాగా పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా, పవన్ కల్యాణ్ షేర్ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం, పలు ఫైల్స్మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం చూపించారు. ప్రస్తుతం ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అదేవిధంగా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను' అని పవన్ వీడియోలో పేర్కొన్నారు.

పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మొదటిసారే మంత్రికాబోతున్నారు. దాంతో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌ స్టేజి మీద ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫ్యాన్స్ అరుపులతో ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.

అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినా.. మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక పవన్ కల్యాణ్‌ తో పాటు జనసేన నుంచి మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్‌ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లు ప్రమాణ స్వీకారం చేశారు.

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో  ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది. ఈ భేటీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా  విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మె‍ల్యేల సమావేశానికి పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిష్ఠానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. కూటమిపై విశ్వాసంతో మంచి విజయాన్ని సాధించారని అభినందించారు. సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ తరఫున సభకు హాజరవుతున్నట్లు పురందేశ్వరి వెల్లడించారు.

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ముందు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో గెలిచిన వెంటనే నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో పవన్ వారితో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.

అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్. https://t.co/QizpBrTIE2 pic.twitter.com/eLYfKImWj1

— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024

పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వైసీపీకి కోలుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. పేరు మార్చుకునేందుకు గెజిట్ పబ్లికేషన్ పేపర్లు సిద్ధం చేసుకుని మీడియాకు చూపించారు.

రెండు, మూడు రోజుల్లో తన పేరు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు అందించింది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ తెలిపారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదో తెలియడంలేదన్నారు. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను ప్రజలు గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక ముందు కూడా జగన్‌తోనే కొనసాగుతుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.

అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది. ఎన్డీయే కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నితీశ్‌కుమార్‌లు కీలకం కానున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడాలి.

ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వల్ల ఎవరైతే వేధించబడ్డారో వాళ్లు అందరూ ఇండియా కూటమిలో చేరుతున్నారని అన్నారు. చంద్రబాబును కూడా బీజేపీ వాళ్లు వేధించారని ఆరోపించారు. దీంతో ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

2014, 2019లో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఒంటరిగానే అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను బీజేపీ దక్కించుకుంది. పేరుకు ఎన్డీయేగా అధికారంలో ఉన్నా బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం సీన్‌ మారింది. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో 241 వద్దనే నిలిచిపోయింది. దీంతో అధికారంలోకి రావడానికి, ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.