janasena - Vishvambhara News

రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 330కి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారని, ప్రజల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించిందని పార్టీ నేతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ రెండు చోట్ల విజయం సాధించి ఖాతా తెరిచింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 34వ డివిజన్ నుండి పోటీ చేసిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు నుండి పోటీ చేసిన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే పార్టీ నాయకులు, శ్రేణులు, వీర మహిళలు ఎంతో కష్టపడి పనిచేశారని కొనియాడారు. వారి కృషికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తరుపున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తమను గుర్తించి ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో మరింత బలం
తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రెండు చోట్ల గెలవడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో కూడా బలంగా పోటీ చేస్తామని వెల్లడించారు. సినీ నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపల్ పోరు: 336 వార్డుల్లో జనసేన పోటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన ఆ పార్టీ, మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు సజావుగా సాగడం, రిటర్నింగ్ అధికారులు వాటిని ఆమోదించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు తమ రిజర్వ్డ్ గుర్తు అయిన 'గాజు గ్లాస్' పైనే పోటీ చేయనున్నారు. జనసేన పార్టీ మొత్తం 11 జిల్లాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తారని, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో రోడ్ షోలు నిర్వహిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. అయితే, తాజాగా అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత పర్యటన ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశించిన అభ్యర్థులు, కార్యకర్తలు ఈ నిర్ణయంతో కొంత నిరాశకు గురయ్యారు.

జనసేన అభ్యర్థులకు హీరో తనీశ్ మద్దతు
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రముఖ తెలుగు యువ హీరో తనీశ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సమాజ శ్రేయస్సు కోరే నిబద్ధత కలిగిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావాలని తనీశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "యువత, మహిళలు, విద్యావంతులు సమాజానికి మంచి చేయాలనే బలమైన ఆకాంక్షతో రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. దీనిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతారు. అందుకే ఆయన పార్టీలో వీరికి పెద్దపీట వేస్తున్నారు." అని అన్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. యువత, మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో గెలిచి వ్యవస్థ మార్పులో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థుల ఎంపికలో విద్యావంతులకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా హీరో తనీశ్ మద్దతు తెలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసి, క్షేత్రస్థాయి శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు తక్కువ సమయం ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన మున్సిపాలిటీల్లో గరిష్ట స్థాయిలో అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి, ఒక  బలమైన రాజకీయ పునాది వేయడమే లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న జన సైనికులు, వీర మహిళలు ఈ ఎన్నికల సమరంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేయాలని.. స్థానిక సమస్యలనే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని.. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించాలని సూచించింది.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు.

ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని, నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని చంద్రబాబు అన్నారు.  ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యనించారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. వైకాపా వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం అన్నారు. ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అత్యున్నత, గౌరవ ప్రదమైన సభగా దీనిని తీర్చిదిద్దాలని సభ్యులకు సూచించారు.

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పవన్, జనసేన అభిమానులు దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తిట్టించే బదులు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం.. అందరినీ చంపేయండి..’’ అని అన్నారు.

‘‘మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్‌కు కట్టుబడి నా పేరు మార్చుకున్నా. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వెంటనే వారిని ఆపాలి. నేను చేతకాని వాడిని. అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని కోరాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నందున. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి’’ అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ (శుక్రవారం) అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు ట్విట్ట‌ర్‌ వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

"తోడబుట్టిన వాడిగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది:

డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,

తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,… pic.twitter.com/Bg2UewPmSp

— Naga Babu Konidela (@NagaBabuOffl) June 21, 2024

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, తాజాగా పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా, పవన్ కల్యాణ్ షేర్ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం, పలు ఫైల్స్మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం చూపించారు. ప్రస్తుతం ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అదేవిధంగా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను' అని పవన్ వీడియోలో పేర్కొన్నారు.

‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన వినతిని సమర్పించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

గత మార్చి 27వ తేదీన ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోయింది. చివరకు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆవెంటనే టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసి చెప్పినట్లే పేరు మార్చేసుకున్నారు.

‘దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవ‌స‌రం లేదు’
నీట్‌ పేపర్‌ లీకైనట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వివి.లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌ రాసి ఉన్న సందేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. అందులో ‘‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌టదే నాశ‌నం అవుతుంది. అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగుల ప్రాణాలు పోతాయి’’  చ‌నిపోతారు అని రాసివుంది.

ఇదిలా ఉండగా నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్‌ రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, ఫలితాల వెల్లడిలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన మాటమార్చారు. అక్రమాలు జరిగిన మాట నిజమేనని అంగీక‌రించడం గమనార్హం.

pic.twitter.com/VZ9RDPSQHP

— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) June 17, 2024

‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన మాస్, కమర్షియల్, క్లాసిక్ అనే తేడాలేకుండా ఒకదానితర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు.. రీరిలీజ్ సినిమాలకు హౌస్‌ఫుల్ కలెక్షన్లు వస్తుండటంతో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఇంకేముంది ఇప్పటికే ఏపీలో జనసేన ఊహించని విజయం సాధించడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలు వేసినా బుక్ మై షో లో మొత్తం మీద 5.5 వేల టికెట్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.