andhra pradesh - Vishvambhara News

నేటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె
Andhra Pradesh Junior Doctors: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. తమ ఉపకారవేతనం (స్టైపెండ్) పెంచాలని జూనియర్ డాక్టర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాతపూర్వక హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు APJUDA ప్రకటించింది. స్టైపెండ్ పెంపుతో పాటు తమకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.

జూనియర్ డాక్టర్ల ప్రకారం.. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, రాతపూర్వకంగా స్పష్టమైన హామీ అందకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసినట్లు, సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు APJUDA ప్రతినిధులు పేర్కొన్నారు.

స్టైపెండ్ పెంపుతో పాటు జూనియర్ డాక్టర్లకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తమ ఆందోళనను కొనసాగిస్తామని APJUDA స్పష్టం చేసినట్లు సమాచారం.

జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడనుంది. మరోవైపు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం–జూనియర్ డాక్టర్ల మధ్య చర్చల ద్వారా సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుందా అన్నది చూడాలి.

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, చేనేత రంగం, మౌలిక సదుపాయాల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక శ్రద్ధ చూపిన వర్గం చేనేత కార్మికులేనని, చేనేతలకు టీడీపీ తప్ప మరో గుర్తు తెలియదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎక్కడా గుంతలు లేని రహదారులను నిర్మిస్తున్నామా లేదా అని నిరంతరం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానం, తెలివితేటలతో పనిచేస్తే సులభంగా ఆదాయం సంపాదించవచ్చని యువతకు సూచించారు. రాష్ట్రంలోని బీచ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు.

క్రోచెట్ కళాకారులకు పవన్ కళ్యాణ్ చేయూత.. ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న అల్లికలను గంటల తరబడి చూస్తూ పని చేసే క్రోచెట్ లేస్ కళాకారుల కంటి సమస్యలను గుర్తించి వారికి అండగా నిలిచారు. వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, దృష్టి లోపాలతో బాధపడుతున్న 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అందించే ఏర్పాట్లు చేశారు. కళాకారుల వృత్తి కొనసాగేందుకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గత నెల విజయవాడలో నిర్వహించిన హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్, హస్తకళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి తమ వృత్తి కారణంగా చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆమె వినతిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఆ ఆదేశాల మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న కళాకారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించగా, వారందరికీ నాణ్యమైన కళ్లజోళ్లు సిద్ధం చేసి అందజేస్తున్నారు. దీంతో అల్లిక పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గి, తమ వృత్తిని మరింత సౌకర్యంగా కొనసాగించగలమని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడితో ఆగకుండా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలి ప్రాంతాల్లో కూడా మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో 350 మంది కళాకారులకు దృష్టి లోపాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి కూడా కళ్లజోళ్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే 20 మందికి పైగా కంటిశుక్లం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

హస్తకళాకారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆచంట, నరసాపురం ప్రాంతాల్లో మరిన్ని ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా క్రోచెట్ లేస్ కళాకారులకు అవసరమైన వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.

పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం.. మరోసారి జలసమాధి కానున్న సంగమేశ్వరం దేవాలయం
Sangameswaram Temple: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని పవిత్ర సంగమేశ్వరం దేవాలయం మరోసారి జలాధివాసానికి చేరువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న ఈ చారిత్రక శైవక్షేత్రం ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటమునిగిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 849.6 అడుగులకు చేరుకోవడంతో ఆలయం చుట్టూ బ్యాక్‌వాటర్స్ విస్తరిస్తున్నాయి. నీటిమట్టం మరింత పెరిగితే ఆలయం పూర్తిగా జలసమాధి కానుంది.

ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలం జలాశయం నీటిమట్టం 841 అడుగులకు చేరుకున్నప్పుడు గర్భగుడిలోకి నీరు ప్రవేశించడం ప్రారంభమవుతుంది. అనంతరం నీటిమట్టం 867 అడుగులకు చేరుకోగానే సంగమేశ్వరం దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల పాటు ఆలయం జలాధివాసంలోనే ఉండటంతో భక్తులకు దర్శనం ఉండదు. వేసవి కాలంలో శ్రీశైలం నీటిమట్టం తగ్గిన తర్వాత మాత్రమే ఆలయం మళ్లీ దర్శనానికి తెరుచుకుంటుంది.

కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శైవక్షేత్రాన్ని దర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆలయం జలాధివాసానికి చేరువవుతున్న నేపథ్యంలో భక్తులు చివరి దర్శనం కోసం భారీగా వస్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!
పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో తాను ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్లాలని తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నుంచి విడుదలయ్యే నీటిని నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విధానంతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలే నీటిని తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యామని చంద్రబాబు అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనుకూలమైన ఫలితాలను తీసుకొచ్చిందని, గతంలో దెబ్బతిన్న పాలనా వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టామని తెలిపారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధికి వేగం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా మరింత కష్టపడి పనిచేయాలని మంత్రులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందిన ప్రజల వివరాలను కూడా ఆయన ప్రస్తావించారు.

రాజధాని అమరావతిని గతంలో కొందరు శ్మశానం, ఎడారిగా విమర్శించారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అది దేశానికే స్ఫూర్తినిచ్చే అభివృద్ధి ప్రాజెక్టుగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మారుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన, అది పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేని స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని పేర్కొంటూ, రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.

శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.

నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.

రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !
ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌ లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను తాజాగా ఢిల్లీ హైకోర్ట్ ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. కాగా జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, ఎన్టీవీ, సాక్షి టీవీ, సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఏపీలో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. దాంతో ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అన్నారు.

ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్త ఛానెల్స్ ని దాదాపుగా 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. కాగా ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్త చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా
ఆంధ్రప్రదేశ్‌లో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది.

గతంలో స్పీకర్‌ను అధికార, విపక్ష పార్టీలు కలిసి చైర్‌లో కూర్చోబెట్టేవి. స్పీకర్‌ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సంప్రదాయానికి వైసీసీ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అయితే, ఇవాళ మాజీ సీఎం, పార్టీ చీఫ్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు.

ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.

కొడాలి నానిపై కేసు నమోదు
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.

రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్
రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.

తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక  రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.