lok sabha election results - Vishvambhara News

దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390- 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అయితే, కొందరు అభ్యర్థులు  ఊహించనంతగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో తెలంగాణ నేత ఉండటం విశేషం. ఐదు లక్షలకు పైగా మెజార్టీని సొంతం చేసుకుని ప్రభంజనం సృష్టించారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిశంకర్ లాల్వాణీ అత్యధికంగా 11,75,092 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రక్బీల్ హుస్సేన్ ధుబ్రీ నుంచి పోటీ చేసి 10,12,476 ఓట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేసి 8,21,408 ఓట్లు సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ నిలిచారు. ఆయన 7, 73,551ఓట్లను సాధించారు.

అదేవిధంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేసి 7,44,716ఓట్లు సాధించి మెజారిటీ లిస్టులో చేరారు. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ 7,10,930ఓట్లు సాధించారు. ఈయన డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సమానంగా సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక స్థానాల్లో గెలుపొందాయి. వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి 5,59,905 మెజారిటీ సాధించారు.

ఏపీ మంత్రులకు అసెంబ్లీ ఫలితాల్లో షాక్..!
ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పాటుగా జనసేన పోటీ చేసిన 21 స్థా్నాల్లో 19 స్థానాల్లో ముందంజలో ఉంది. జగన్ మినహా మిగిలిన మంత్రులందరూ ఓటమి అంచుల్లో ఉన్నారు.

వైఎస్ జగన్ మినహా ఆయన మంత్రివర్గంలోని మంత్రులంతా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ మంత్రులపై ఉన్న అవినితీ ఆరోపణలు వీరి ఓట్లపై భారీ ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. నిధులు పంపిణీపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టపోవడం వంటి పలు కారణాలతే వైసీపీ మంత్రులను ప్రజలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

ఓటమి దిశగా వెళ్తున్న వారి జాబితాలో బొత్స సత్యన్నారాయణ, మేరుగ నాగార్జున, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, ఆది మూలపు సురేష్‌లు ఉన్నారు. వీరింతా వైసీపీ హయాంలో మంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే.