kishanreddy - Vishvambhara News

ఖనిజ రంగంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని అన్వేషించని ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రెండో విడత అన్వేషణ లైసెన్స్ బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ, ఎస్‌బీసీఏపీఎస్, ఎంఎస్‌టీసీ, ఎన్ఎంఈటీ వంటి వివిధ విభాగాల ప్రతినిధులు వేలం ప్రక్రియ, ఈ-వేలం పద్ధతులు, మరియు అన్వేషణ ఖర్చులలో రాయితీలు  పొందే పథకాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఖనిజ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా అన్వేషణ ప్రక్రియలో భారీగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో చేపడుతున్నవి సాధారణ సంస్కరణలు కావు.. ఇదొక సంస్కరణల ఎక్స్‌ప్రెస్" అని ఆయన వ్యాఖ్యానించారు. గనుల రంగంలో పారదర్శకత, పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా పరివర్తనాత్మక మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు.

ఏఐ, ఎంఎల్ సాంకేతికతతో ‘నెక్స్ట్-జనరేషన్’ పోర్టల్
ఖనిజ అన్వేషణలో డేటా విశ్లేషణను సులభతరం చేసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన నెక్స్ట్-జనరేషన్ పోర్టల్‌నుమంత్రి ప్రారంభించారు.ఇది ఏఐ, ఎంఎల్ ఆధారిత సాధనాలతో డేటా సేకరణ, విశ్లేషణను ఏకీకృతం చేస్తుంది. నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీతో అనుసంధానమైన ఈ పోర్టల్, అన్వేషణలో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

11 ఖనిజ బ్లాకులకు వేలం
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. మొదటి విడతకు వచ్చిన అద్భుతమైన స్పందనతో ఇప్పుడు రెండో విడతను చేపట్టినట్లు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 11 కీలక, భూ పొరల లోతుల్లో ఉన్న ఖనిజ బ్లాకులను ఈ విడతలో చేర్చినట్లు తెలిపారు. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2023 ద్వారా ప్రవేశపెట్టిన 'అన్వేషణ లైసెన్స్' విధానం వ్యాపార నిర్వహణను సులభతరం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.

కాంగ్రెస్ దేశానికి పట్టిన పెద్ద పీడ: కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవరోధమని, ఆ పార్టీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలు కేవలం వార్డుల గెలుపు కోసం కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రస్తుతం "పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా" తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ మంత్రులు దోచుకున్నది పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరుల ఆకాంక్షలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని, కేవలం బీజేపీతోనే నిజమైన మార్పు సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి విషయంలో కేంద్రం వెనకాడటం లేదని చెబుతూ కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రూ.3.50 లక్షల కోట్ల నిధులతో హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చబోతున్నాయని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 'పెద్దరికం' చేస్తోందే తప్ప, అదనంగా ఏమీ చేయడం లేదని విమర్శించారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఎంపీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జాతీయ స్థాయిలో రహస్య ఒప్పందం ఉందని, అందుకే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే కమల దళాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

తాడిచర్ల-1 గనులు తెలంగాణకే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత కొంతకాలంగా రాజకీయంగా పెను దుమారం రేపుతున్న తాడిచర్ల-1 బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఈ గనులను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో అధికారికంగా వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను తెలియజేశారు. తాడిచర్ల-1 బొగ్గు బ్లాక్‌ను 2015 ఆగస్టు 31నే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TG GENCO)కు కేటాయించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. 2019లో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక తర్వాత, 2020 జూన్ నుండి గనుల కేటాయింపు విధానం మారిందని ఆయన తెలిపారు. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గనులను కేవలం వేలం ద్వారానే కేటాయించాలని కమిటీ సూచించిందని, అత్యంత అరుదైన పరిస్థితుల్లోనే నేరుగా కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే, తాడిచర్ల-2 గనులను ఇంకా ఎవరికీ కేటాయించలేదని మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడిచర్ల కోల్ బ్లాక్‌ను జెన్కోకు కేటాయించినప్పటికీ, దాని మైనింగ్ బాధ్యతలను సింగరేణికి ఇవ్వకుండా.. ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల పాటు టెండర్ కట్టబెట్టారని విమర్శించారు. సింగరేణి సంస్థతో పనిచేయలేమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయించుకుని మరీ ప్రైవేటుకు అప్పగించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు సుమారు రూ.47,000 కోట్లు బకాయి పడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో మరే కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే తాడిచెర్ల గనులను ఏఎంఆర్‌ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని, ఇందులో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు గత ప్రభుత్వ హాయంలో వినిపించాయి. ఈ గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని నాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేశారు. ఏఎంఆర్‌ కంపెనీకి తాడిచర్ల బొగ్గుగనుల కేటాయింపులపై విచారణ జరిపించాలని నాడు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు డిమాండ్ చేశారు. తాజా కేంద్రం వివరణతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.

మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. ఈ జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేస్తూ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, గిరిజన శాఖల ఉమ్మడి నిధులు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా ఉత్సవానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో, వారి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతర విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గిరిజన సంప్రదాయాలను, విశ్వాసాలను కాపాడేందుకు కేంద్రం నిరంతరం మద్దతిస్తుందని చెప్పాయి. కేంద్రం ప్రకటించిన నిధులతో జాతరలో తాగునీరు, పారిశుధ్యం, వసతి వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మేడారం జాతరకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహకారం గిరిజన సంస్కృతి పరిరక్షణకు, జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి దుస్థితికి గత పాలకుల అవినీతి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి బోర్డు కేవలం నామమాత్రంగానే ఉండేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. వారి హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు. టెండర్ల కేటాయింపు నుంచి కాంట్రాక్టుల వరకు అన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పర్యవేక్షించేవారని తెలిపారు. బోర్డు సమావేశ వివరాలు కూడా కనీసం తన దృష్టికి రాకుండా గోప్యత పాటించేవారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆనాటి సీఎండీని మరో నాలుగేళ్లు అదనంగా కొనసాగించి, సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

పేరుకుపోయిన అప్పులు.. అస్తవ్యస్తంగా నిధులు
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కిషన్‌రెడ్డి పలు కీలక గణాంకాలను బయటపెట్టారు. గత పదేళ్లలో సింగరేణి అప్పులు రూ.32,000 కోట్లకు పైగా పెరిగాయన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలు సింగరేణి విద్యుత్‌ను వాడుకుని డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులకు, సంస్థకు సుమారు రూ.47,000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. నిధుల కొరత సాకుతో జిల్లాలకు అందాల్సిన రూ.1,500 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) కూడా నిలిపివేశారని పేర్కొన్నారు. సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధులను కూడా బీఆర్ఎస్ నేతలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ప్రైవేటు శక్తులకు పెద్దపీట
కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందంటూ గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. "సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదు. కానీ, బీఆర్ఎస్ హయాంలోనే ప్రైవేటు కంపెనీలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టారు. అప్పుడు లేని ప్రైవేటీకరణ భయం ఇప్పుడెందుకు?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ సీఎండీతో కాలం గడుపుతుండటం సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని గత ప్రభుత్వం ఒక రాజకీయ ఏటీఎంలా వాడుకుంది. నిధుల మళ్లింపు, కుటుంబ సభ్యుల జోక్యంతో సంస్థను సంక్షోభంలోకి నెట్టారు." కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీ వివరాలను కిషన్ రెడ్డి ఈ లేఖలో వివరించారు. మెట్రో మొదటి దశను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం (Takeover) చేసుకుంటుందని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించాలంటే, ముందుగా మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, లావాదేవీలు, టేకోవర్ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

సంయుక్త కమిటీ ఏర్పాటులో జాప్యం
మెట్రో మలిదశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీ (Joint Committee) ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో ఈ కమిటీ ఏర్పడాలని, కేంద్రం తన వంతు ప్రక్రియకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
మెట్రో ఫేజ్-2పై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ అధికారుల పేర్లను ఎప్పుడు పంపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో మెట్రో విస్తరణ పనుల్లో ఉన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు
సార్వత్రికల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని అన్నారు.

రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశముందన్నారు. తెలంగాణ డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మరోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని తెలిపారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను మోడీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఇంకా నయం రీ-ఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదని ఎద్దేవా చేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి బరిలోనిలిచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా సార్వత్రికల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏపీలో టీడీపీ లీడ్‌లో కొనసాగుతోంది. మరోవైపు లోక్ సభకు సంబంధించి కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది.