Bollywood - Vishvambhara News

అక్షయ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం
విశ్వంభర, సినిమా బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దంపతులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని జుహు ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు అక్షయ్ సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనం రోడ్డుపై బోల్తా పడటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను విదేశాల్లో జరుపుకుని, తిరిగి ఇంటికి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి తమ నివాసానికి వెళ్తుండగా జుహు సమీపంలో ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నియంత్రణ కోల్పోయి నేరుగా అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పైకి దూసుకొచ్చింది. ఆటోను తప్పించే క్రమంలో అక్షయ్ వాహనం, ఆయన సెక్యూరిటీ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఎస్కార్ట్ కారు పల్టీ కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, ట్వింకిల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు వారి వాహనంలోని సేఫ్టీ ఫీచర్లు పని చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆటో పూర్తిగా ధ్వంసమైంది.

అక్షయ్ కుమార్ దంపతులు జనవరి 18నే తమ 25వ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. "ఒకరి కలలకు ఒకరం తోడుగా ఉంటూ.. ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎంతో మధురంగా సాగింది" అంటూ అక్షయ్ పోస్ట్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపినప్పటికీ, తమ అభిమాన నటుడు క్షేమంగా ఉన్నారని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఏఆర్‌ రెహమాన్‌పై జాలి వద్దు.. ఆయన చాలా రిచ్‌..!
విశ్వంభర, సినిమా బ్యూరో: బాలీవుడ్‌లో వివక్షపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనిపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. రెహమాన్ లాంటి సంపన్న, ప్రసిద్ధ వ్యక్తులకు మతం లేదా ప్రాంతం పేరుతో ఇబ్బందులు ఎదురవుతాయనడం నమ్మశక్యంగా లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఆర్ రెహమాన్ భారత్‌లో అత్యంత గౌరవం పొందే వ్యక్తి. ఆయన సంపన్నుడు మాత్రమే కాదు, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సంగీతకారుడు అని అన్నారు.
బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ వంటి వారు సూపర్ స్టార్లుగా కొనసాగుతున్నారు. వారు ఏ మతానికి చెందినవారైనా సరే, వారి స్థాయికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. "నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. రెహమాన్ లాంటి వ్యక్తులను అన్ని మతాల వారు గౌరవిస్తారు. కాబట్టి ఆయన విషయంలో ఎవరూ జాలిపడాల్సిన అవసరం లేదు" అని ఆమె పేర్కొన్నారు.

అసలు రెహమాన్ ఏమన్నారు?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో ప్రాంతీయ లేదా మతపరమైన పక్షపాతం ఉందా అన్న ప్రశ్నకు రెహమాన్ బదులిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా చిత్ర పరిశ్రమలో 'పవర్ షిఫ్ట్' జరిగిందని, సృజనాత్మకత లేని వ్యక్తులు కీలకంగా మారుతున్నారన్నారు. తనకు వ్యక్తిగతంగా వివక్ష ఎదురుకాకపోయినా, మతపరమైన కారణాల వల్ల పని దొరకడం లేదనే గుసగుసలు తన చెవిన పడ్డాయని తెలిపారు. తాను పని కోసం ఎవరి వెనకాల తిరగనని, చిత్తశుద్ధితో పని చేస్తే అవకాశాలు అవే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన వెంటనే స్పందించారు. తన లక్ష్యం సంగీతం ద్వారా సేవ చేయడం, గౌరవించడమే తప్ప ఎవరినీ బాధపెట్టడం కాదని క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు నమోదైంది. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశాడు. సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్పా, రాజ్‌కుంద్రాతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ఉద్యోగి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టిన ముంబై అదనపు సెషన్స్ కోర్టు శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్‌కుంద్రాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జడ్జికి చూపడంతో కేసు నమోదుకు ఆదేశించారు. 2014లో రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టిలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఐదేళ్లకు సంబంధించిన ఓ గోల్డ్ స్కీమ్ ప్రకటించింది. అందులో భాగంగా రూ.18.58 లక్షలకు తాను కిలో బంగారం కొనుగోలు చేశానని సదరు వ్యక్తి పోలీసులకు వివరించారు. దీనికి ఆధారంగా తనకు ఒక గోల్డ్ కార్ట్ కూడా ఇచ్చారని అతడు ఆరోపించాడు. సదరు జోషి టర్మ్ ప్లాన్ 2019 మార్చి 25న ముగిసినప్పటికీ వారు చెప్పినట్లు బంగారం ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దేశాన్ని కుదిపేస్తున్న అజ్మీర్ లైంగిక దాడి కేసు.. సంచలనాలు వెలుగులోకి..!
అజ్మీర్ లైంగిక దాడి కేసు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి.. ఆ తర్వాత వారి ఫొటోలను మార్పింగ్ చేయడం.. డబ్బులు డిమాండ్ చేసి అమ్మాయిలను సామూహికంగా లైంగిక దాడి చేయడం.. ఆ తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి పదే పదే డబ్బలు వసూలు చేయడం, పలుమార్ల లైంగిక దాడలు చేయడం.. ఇది అజ్మీర్ కథ. ఇప్పుడు ఈ కేసు బయటకు రావడంతో అందులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ దారుణం చాలా రోజులుగా సాగుతున్నా వారికి భయపడి అమ్మాయిలు బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఓ యువతి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. నిందితులు కోచింగ్ సెంటర్లకు వెళ్లే అమ్మాయిలనే ట్రాప్ చేస్తుంటారు. రీసెంట్ గా ఓ యువతి కోచింగ్ సెంటర్ కు వెళ్లగా అక్కడ ఆమెకు మరో అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన యువతి.. ఇర్ఫాన్ అనే పేరుతో ఉన్న ఇన్ స్ట్రాగ్రామ్ ఐడీని ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా యాక్సెప్ట్ చేయాలంటూ తెలిపింది. ఆ అమ్మాయి అలాగే చేసింది. యువతి ఇన్ స్టా నుంచి ఫొటోలు డౌన్ లోడ్ చేసుకున్న సదరు యువకుడు వాటిని మార్పింగ్ చేశాడు.

ఆమెను డబ్బులు పంపించాలని.. లేదంటే సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. ఆమె డీల్ కు ఒప్పుకుని రూ.5 లక్షలు ఇవ్వడానికి ఓకే చెప్పింది. తన ఇంట్లోనే డబ్బులను దొంగతనం చేసింది. నిందితుడు చెప్పిన చోటకు డబ్బులతో వెళ్లగా.. సదరు యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని మొత్తం వీడియో తీశారు. ఆ వీడియోను యువతికి పంపించి మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేకపోయిన యువతి.. విషయం తన ఇంట్లో వారికి చెప్పింది. కుటుంబీకులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం బయటకు వచ్చింది.

కేసు నమోదు చేసిన అజ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 2023 నుండి ఈ తతంగమంతా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

కాబోయే వాడిపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉండాలంటూ?
జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ ఒక సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో బయటపెట్టారు.

గత కొంత కాలంగా ఈమె ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే భర్తలో ఉండే క్వాలిటీ గురించి ఈమెకు ప్రశ్నలు వేశారు.

ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానం చెబుతూ తనని పెళ్లి చేసుకోబోయే వాడు నా డ్రీమ్స్ ను తన డ్రీమ్స్ గా భావించాలని అలాగే ఎప్పుడూ నా పక్కనే ఉంటూ నాకు ధైర్యం చెప్పే వాడు కావాలి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.