Chattisgard - Vishvambhara News

మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సమక్షంలో వారు తమ ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన ఈ తొమ్మిది మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిందరిపై కలిపి మొత్తం రూ.47 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు గతంలో పలు హింసాత్మక ఘటనలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా దళాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలపై నమ్మకంతోనే ఈ మావోయిస్టులు బయటకు వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన తక్షణ సాయం, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. "నక్సలిజం వల్ల ఒరిగేదేమీ లేదని, అడవుల్లో ప్రాణాలు పణంగా పెట్టే కంటే సామాన్య పౌరులుగా జీవించడం మిన్న అని గుర్తించాలి. ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లొంగిపోవాలి" అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వరుస లొంగుబాట్లతో ధంతారి, బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం గణనీయంగా తగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారీ పేలుడు.. 20 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్ పేలి 20 మంది మృతి చెందారు. బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో  ఫ్యాక్టరీలో 40 మందికిపైగా విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.  పేలుడు ప్రభావంతంతో స్థానికంగా ఉండే చాలా ఇళ్లు కూడా బీటలు వారాయని స్థానికులు చెబుతున్నారు.

ఘటన తర్వాత స్థానికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీలోని కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

800 మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్.. భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఐదుకి చేరు అవకాశం ఉందని సమాచారం. మావోయిస్టుల కోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో 800 మంది పోలీస్ బలగాలతో ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఐదు నెలలుగా సాగుతోంది. పోలీసులు మావోయిస్టుల ఏరివేతకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఐదు నెలల్లో దాదాపు 27 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో 107 మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు పార్టీ చెబుతోంది. ఇవాళ మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

ఓవైపు ఎదురు తిరుగుతున్న మావోయిస్టులను హతమార్చుతూనే.. మరోవైపు నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ శర్మ నక్సలైట్లకు బహిరంగ పిలుపునిస్తూ లేఖ రాశారు. నక్సల్ పునరావాస విధానంలో మార్పు కోసం నక్సలైట్‌ల నుండి ప్రభుత్వం సూచనలు కోరుతుందని చెప్పారు. ప్రభుత్వం ముందు లొంగిపోయే నక్సలైట్లు తమ వివరాలు తెలిపేందుకు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఈమెయిల్ ఐడీ, గూగుల్ ఫామ్‌ను విడుదల చేశారు.

అన్ని బూటకపు ఎన్ కౌంటర్లే.. చత్తీస్ ఘడ్ కాల్పులపై బహిరంగ లేఖ!
ఇటీవల కాలంలో చత్తీస్ ఘడ్ మావోయిస్టుల దాడి జరగడంతో పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు జరిగి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా బూటకపు ఎన్ కౌంటర్లే అంటూ ఓ బహిరంగ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ నోట్ మావోయిస్టులు విడుదల చేశారు.

చత్తీస్ ఘడ్ లో జనవరి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్ కౌంటర్లన్ని బూటకపు ఎన్ కౌంటర్లు. వీటి ద్వారా ఎంతో మంది అమాయకపు మావోయిస్టులను అలాగే భద్రతా దళాలను కాల్చి చంపాయని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికారి ప్రతినిధి వికల్ప్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఇకపోతే ప్రభుత్వంతో చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పలు సంస్థలకు మావోయిస్టు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ల గురించి ఈ విధమైనటువంటి లేఖ విడుదల చేయడంతో ఇవి కాస్త చర్చలకు కారణమైంది.

ఇక్కడ జరుగుతున్నవన్నీ బూటకపు ఎన్ కౌంటర్లే!

ఛత్తీస్ ఘడ్ లో జనవరి నుంచి ఇప్పటి వరకు బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా అనేక మంది మావోయిస్టులతో అమాయకులనూ భద్రతా దళాలు కాల్చి చంపాయంటూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రెస్ నోట్ విడుదల చేసిన దండకారణ్య… pic.twitter.com/BayMVieIO5

— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2024