tgsrtc - Vishvambhara News

టీజీఎస్‌ ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా రంగంలో విద్యుత్ వాహనాల శకం మరింత విస్తృతం కానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సేవలలో భాగంగా కొత్తగా 1,085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కు టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఈ భారీ ప్రక్రియ ముందుకు సాగుతోంది. నగరాల్లో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం
హైదరాబాద్ నగర రోడ్ల స్థితిగతులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. 12 మీటర్ల పొడవు ఉండే ఈ లో-ఫ్లోర్ బస్సులలో ఏసీ, నాన్-ఏసీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు కుదుపులు లేని ప్రయాణాన్ని అందించేందుకు బస్సు ముందు, వెనుక భాగాలలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉండి, ఒకే ఛార్జ్‌తో 250 కిలోమీటర్ల పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

అందరికీ అందుబాటులో సౌకర్యాలు
కేవలం సాంకేతికతకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ బస్సులను డిజైన్ చేశారు. ముఖ్యంగా వీల్‌చైర్ ఉపయోగించే ప్రయాణికుల కోసం బస్సులో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,600 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా నడుపుతున్న ఒలెక్ట్రా సంస్థకు, ప్రస్తుతం చేతిలో ఉన్న 10 వేల వాహనాల ఆర్డర్లలో ఇది అత్యంత కీలకమైనది. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ఈ బస్సులను అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

పర్యావరణ హితమే లక్ష్యం
పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ వాహనాలే సరైన ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త బస్సుల రాకతో డీజిల్ వినియోగం తగ్గడమే కాకుండా, శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం వల్ల సాధారణ ప్రయాణికులకు కూడా విలాసవంతమైన ప్రయాణం చేరువ కానుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దక్కిన ఈ ఆర్డర్ సంస్థకు, రాష్ట్ర రవాణా రంగానికి కొత్త ఊపిరిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంక్రాంతి జోష్.. ఆర్టీసీ ఫుల్ ఖుష్!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC)కు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కాసుల పంట పండించింది. పల్లె బాట పట్టిన ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడటంతో సంస్థ ఖజానా కళకళలాడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయి ఆదాయం సాధించి ఆర్టీసీ తన సత్తా చాటింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల వ్యవధిలో టికెట్ విక్రయాల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు ప్రకటించారు. సగటు రోజు వారి ఆదాయం రూ.13.48 కోట్లు ఉండగా.. ప్రత్యేక సర్వీసుల ద్వారా రోజుకు అదనంగా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈ ఏడాది సంక్రాంతికి వరుస సెలవులు (డబుల్ వీకెండ్) రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు భారీగా స్వగ్రామాలకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ, సుమారు 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ వాహనాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఆర్టీసీ సురక్షిత ప్రయాణాన్ని అందించడంతో జనం కూడా ప్రభుత్వ బస్సులకే జై కొట్టారు.

తిరుగు ప్రయాణానికి సిద్ధం..
పండుగ ముగించుకుని తిరిగి పట్నం వస్తున్న వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు భారీగా స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రధాన జంక్షన్లు, బస్టాండ్ల వద్ద అధికారుల పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ స్థాయి ఆదాయం రావడం పెద్ద ఊరటని.. ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీని నమ్మిన ప్రజలకు రవాణా అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలనుభర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. 'బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు 'మేము సైతం' అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారని గుర్తు చేశారు. అతి పెద్ద సమ్మెగా నిలిచిన సకల జనుల సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది.” అని అన్నారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని చెప్పారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు.