USA VS CAN - Vishvambhara News

టీ20 ప్రపంచకప్ ఆరంభం.. అమెరికాతో కెనడా ఢీ!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో అమెరికాతో కెనడా ఢీకొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137రన్స్ చేసింది.

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగంగా ఉండటంతో ఈ ప్రపంచకప్ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. 20 జట్లను 5 టీమ్స్ చొప్పున 4 గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో పోటీకి దిగుతాయి. టాప్-2లో నిలిచిన రెండు టీమ్‌లు సూపర్ ఎయిట్‌కు చేరుకుంటాయి. సూపర్ ఎయిట్‌లో ఎనిమిది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ఒక్కో టీమ్ మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది.

ఒక్కో గ్రూప్ నుంచి టాప్- 2లో నిలిచిన రెండు టీమ్‌లు సెమీస్ ఆడుతాయి. చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్‌తో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, క్రికెట్'కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యస్తోంది. వెస్టిండీస్‌తో 2010లో మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో ప్రపంచకప్ నిర్వహిస్తోంది. ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా మరిన్ని జట్లు బరిలో నిలిచాయి.

మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆదివారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భమిదని గుర్తుచేశారు. ఆధునిక భారతం కళ్లరా చూసిన.. మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఒక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదని తెలిపారు.

అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదని, సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిదని పేర్కొన్నారు. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణదిఅని తెలిపారు. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిదని వెల్లడించారు.

‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా... అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు.. దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ. నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ. అంటూ రాసుకొచ్చారు. ‘అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ...జైజై తెలంగాణ..’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని...
దశాబ్దం గడిచిన సందర్భమిది.

ఆధునిక భారతం కళ్లరా చూసిన...
మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం.

ఒక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన...
కేసీఆర్ పోరాట ఫలితమిది.

అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై...
ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది.… pic.twitter.com/sgrD0FXpmC

— KTR (@KTRBRS) June 2, 2024