T20 World Cup 2024 - Vishvambhara News

వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం
సూపర్-8లో మరో సంచలన రికార్డు నమోదైంది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్ సూపర్-8లో ఆస్ట్రేలియాతో తలపడి 21పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ (3/28) టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనుకబడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (59) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నవీనుల్ హక్ (3/20), నబీ (1/1), రషీద్ ఖాన్ (1/23), ఒమర్జాయ్ (1/10)తో మంచి ప్రదర్శనకనబరిచారు. దీంతో గ్రూప్-1లో భారత్ రెండు విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్గాన్ ఒక్కో గెలుపుతో రేసులో ఉన్నాయి.

సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించి గ్రూప్-A నుంచి భారత్ సూపర్ -8లోకి అడుగు పెట్టింది. యూఎస్ఏతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల టార్గెట్‌ను ఛేదించి ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన గెలిచి రెండో స్టేజ్‌కు చేరుకుంది. కాగా, సూపర్-8 కు చేరుకోవడం టీమిండియాకు బిగ్ రిలీఫ్ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కఠినమైన పిచ్‌పై సూర్యకుమార్ (50*), శివమ్ దూబె (31*) పరిణతి కనబరిచారని టీమ్ ఇండియా రోహిత్ వ్యాఖ్యానించాడు.

అదేవిధంగా యూఎస్ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మూలాలు కలిగిన క్రికెటర్లను మెచ్చుకున్నారు. గతేడాది ఎంఎల్సీ (మేజర్ లీగ్ క్రికెట్)లో వారి ఆటను చూశామని నిరంతరం మెరుగవుతూ ఉన్నారని తెలిపాడు. ఈ మ్యాచ్ అత్యంత క్లిష్టంగా ఉంటుందని తెలుసని ఏక్షణమైనా ఫలితం మారవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పిచ్‌పై 110+ స్కోర్‌ అయినా మంచి లక్ష్యమే అవుతుందని తెలిపాడు. అయితే, సూర్యకుమార్‌తో పాటు శివమ్ దూబె కీలక భాగస్వామ్యం నిర్మించడంతో మ్యాచ్‌పై పట్టు సాధించగలిగామని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లోనూ చివరి వరకూ పోరాడామన్న రోహిత్ ఆత్మవిశ్వాసంతో రెండో స్టేజ్‌కు వెళ్లగలిగామని చెప్పుకొచ్చాడు. తక్కువ స్కోరు నమోదైనప్పటికీ బౌలర్లదే పైచేయి అవుతుందన్నారు. కాసేపు ఆచితూచి ఆడాల్సి ఉంటుందని, సూర్య, దూబె అదే చేశారని తెలిపాడు. యువ బౌలర్ అర్ష్దీప్ మరోసారి తన సత్తా చాటాడని, బౌలింగ్ మరిన్ని ఆప్షన్లు ఉండటం మంచిదేనని తెలిపాడు. అందుకే ఈసారి దూబెతో బౌలింగ్ చేయించామన్నాడు.

యూఎస్ జట్టులో 8 మంది భారత సంతతి వారే..
ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న యూఎస్ టీమ్ ను మినీ ఇండియా టీమ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జట్టులో ఉన్న ఎనిమిది మంది కీలక ఆటగాళ్లు మన ఇండియా సంతతికి చెందిన వారే కావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి.

న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్కాబోతోంది. ఇందులో గెలిస్తే ఇండియా టీమ్ కు సూపర్-8 బెర్త్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు అక్కడకు వెళ్లకుండా ఇండియా టీమ్ కు మరో మినీ ఇండియా టీమ్ అడ్డుపడుతోంది. అదేనండి యూఎస్ టీమ్.

ఇప్పుడు యూఎస్ టీమ్ లో ఉన్న కెప్టెన్ సహా మిగతా ఏడుగురు మనవాళ్లే. కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌, హర్మీత్ సింగ్, సౌరభ్‌ నేత్రావల్కర్, జస్‌దీప్‌ సింగ్, నోస్తుష ప్రదీప్‌ కెంజిగె, నితీశ్‌ కుమార్‌ భారత క్రికెటర్లే. వీరితో పాటు పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లు కూడా ఇప్పుడు యూఎస్ టీమ్ లో ఆడుతుండటం విశేషం.

టీ20 వరల్డ్ కప్‌.. బంగ్లాపై సౌతాఫ్రికా చారిత్రాత్మక విజయం
టీ20 వరల్డ్ కప్‌-2024లో భాగంగా సోమవారం న్యూయార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 113 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా అవతరించింది. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధించి దక్షిణాఫ్రికా.

114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి బంతికి 6 అవసరమవగా క్రీజులో ఉన్న టస్కిన్ అహ్మద్ కేవలం 1 పరుగు తీశాడు. దీంతో దక్షిణాఫ్రికా సంబురాల్లో మునిగితేలింది.

46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల స్కోరును‌ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసిందని చెప్పాలి. బంగ్లా తర్వాత భారత్, న్యూజిలాండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచ కప్‌ 2024లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం రాత్రి 8గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రారంభమైంది ఈ మ్యాచ్. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాక్ జట్టు.

అయితే సూపర్ ఓవర్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. పాక్ బౌలర్లు రాణించడంతో భారత్ టోర్నీ ముగిసేసరికి 19ఓవర్లలో 119 పరుగులు చేశారు. 120 పరుగుల లక్ష్యాన్ని పాక్ జట్టు ముందు ఉంచారు. భారత్ జట్టులో కోహ్లీ(4), సూర్య(7), దూబే(3), హార్దిక్(7), జడేజా(0) నిరాశపరిచారు. నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు, అమీర్ 2, షాహీన్ అఫ్రీదీ ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత పాక్ జట్టు 120పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే, టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా నిష్క్రమించారు. 113/7 స్కోరుకే పరిమితమైంది పాక్.

ముఖ్యంగా స్టార్ బౌలర్ బుమ్రా పాక్‌కు కీలకమైన 3 వికెట్లు తీసి భారత్‌ను విజయతీరాలకు తీసుకెళ్లాడు. 19వ ఓవర్‌లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఇఫ్తికార్ వికెట్ తీశాడు. పాండ్యా 2, అక్షర్, హర్షదీప్ చెరో వికెట్ తీశారు. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్(31), బాబర్ (13), ఉస్మాన్ (13), ఫఖర్ (13), ఇమాద్(15) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచుల్లో భారత్ (7సార్లు) అత్యధికంగా గెలిచిన జట్టుగా నిలిచింది.

హైఓల్టేజీ సమరానికి సై.. నేడే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఇవాళ(ఆదివారం) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు పోరుకు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ స్టేడియం వేదికైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ హైఓల్టేజీ సమరాన్ని చూసేందుకు అభిమానులు తగ్గేదే లే అంటున్నారు. టిక్కెట్ల భారీ ధరను భారీగా పెంచినప్పటికీ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్టేడియానికి చేరుకుంటున్నారు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కలిగి ఉన్న ఈ స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన అదే దూకుడు మీద ఉండగా పాక్ జట్టు యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌తో నిరాశలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశముంది.

ప్రపంచ కప్‌లో దాయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే టీమిండియా జట్టులో అక్షర్ బదులుగా కుల్దీప్ రానున్నట్లు సమాచారం. టీమిండియా: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్ లేదా కుల్దీప్, బుమ్రా, అర్దీదీప్, సిరాజ్. పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఉస్మాన్, జమాన్, ఆజమ్, ఇఫ్రికార్, షాదాబ్ లేదా ఆయూబ్, ఆఫ్రిది, నసీమ్, ఆమిర్, రవూఫ్ లు ఉండవచ్చని అంచనా.

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు
డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్‌లో శ్రీలంక‌కు ఘెర ప‌రాభ‌వం ఎదురైంది. ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిని చవిచూసింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 124 ప‌రుగులకు మాత్రమే పరిమితమైంది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ నిస్సాంక 47 ర‌న్స్‌తో రాణించ‌గా, ధ‌నుంజ‌య 21, డిసిల్వా 19 ప‌రుగుల‌తో రాణించారు. బంగ్లాదేశ్ విజ‌యంలో హృదోయ్ (40), లిట‌ర్ దాస్ (36) కీల‌కంగా వ్యవహరించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్ తుషార 4, హస‌రంగ 2 వికెట్లు పడగొట్టారు.

ఇక ఈ ఓట‌మితో శ్రీలంక సూప‌ర్‌-8 అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టికే త‌న తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ప‌రాజ‌యంతో ఈ టీ20లో శ్రీలంకకు ఇది రెండో ఓటమి. బ్యాట‌ర్లు విఫలమవడంతో బంగ్లాదేశ్‌ విజృంభించింది. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్‌, రిష‌ద్ హుస్సేన్ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టి లంక బ్యాట‌ర్ల‌కు చెమటలు పట్టించారు. అనంత‌రం 125 ప‌రుగుల స్వ‌ల్ప ఛేద‌న‌తో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ 19ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది.

మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్‌శర్మ అభిమాని.. వీడియో వైరల్
త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా కలవడానికి అభిమానులు ఉవ్విల్లూరుతుంటారు. మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వ‌చ్చే సీన్స్ చాలా సార్లు క‌నిపిస్తూనే ఉంటాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడిన వార్మప్ మ్యాచులో అలాంటి సంఘటనలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు.

ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ శర్మ వద్దకు నేరుగా వెళ్లి హగ్ చేసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చితకబాదారు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. వద్దని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. సదరు వ్యక్తిపై తమ కోపాన్ని ప్రదర్శించారు.

ఇది గమనించిన మ్యాచ్ నిర్వాహకులు రోహిత్ శర్మ చేస్తున్న రిక్వెస్ట్‌ను పోలీసులు తెలిపారు. అయినా అత‌డిని ఈడ్చుకుంటూ గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సదరు అభిమానిని రక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వార్మ‌ప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 182 ర‌న్స్ చేసింది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 32 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 53 ర‌న్స్ చేశాడు. హార్దిక్ పాండ్య 40, సూర్య‌కుమార్ యాద‌వ్ 31 ర‌న్స్‌తో రాణించారు.
ల‌క్ష్య ఛేధ‌న‌లో త‌డబ‌డిన బంగ్లాదేశ్ 122 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.

- Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024