USA - Vishvambhara News

మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ కన్నుమూత
మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అమెరికాలో నివాసముంటున్న ఆయన గురువారం (జూన్ 7)న అక్కడే తుదిశ్వాస విడిచినట్లు గుంటూరులోని వారి కుటుంబ బంధువు డాక్టర్‌ రమణ యశస్వి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. శ్రీశ్రీ సతీమణి సరోజకు 80 ఏళ్ల వయసులో పుత్రవియోగం కలగడం పట్ల శ్రీశ్రీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరంగం వెంకటరమణ అమెరికాలోని కనెక్టికల్‌ రాష్ట్రంలో నివాసముంటున్నారు. ఫైజర్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పాతికేళ్ల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మాధవి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గణపవరం. వెంకట రమణ పిల్లలు శ్రీనివాసరావు, కవిత చదువుకుంటున్నారు. శ్రీరంగం వెంకట రమణ మరణం పట్ల సాహితీ వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఒబామా ఇంట్లో తీవ్ర విషాదం.. మిచెల్‌ తల్లి కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఫస్ట్‌లేడీ, ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా తల్లి మరియన్‌ రాబిన్సన్‌ శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. ఈ విషయాన్ని బరాక్‌, మరియన్‌ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుమార్తె, అల్లుడితో కలిసి మరియన్‌ శ్వేత సౌధంలోనే ఉన్నారు.

ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణను ఆమె చూసుకున్నారు. మరియన్‌ను కుటుంబ సభ్యులు ముద్దుగా ‘మొదటి బామ్మ’ అని పిలుచుకుంటారు. మరియన్‌ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. షికాగోలో 1937లో జన్మించిన రాబిన్సన్ ఆ ఇంట్లో ఏడుగురు పిల్లలలో ఒకరు.

ఆమె యుక్తవయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. న‌ల్ల జాతీయులు కావ‌డంతో యునైటెడ్ స్టేట్స్‌లో జాతి వివక్ష ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి చర్మం రంగు కారణంగా యూనియన్‌లో చేరడానికి, పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడానికి అనుమతించబడలేదు. అయినప్పటికీ  బరాక్ ఒబామా మొదటి నల్లజాతి అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఆమె త‌న‌ కుమార్తె, అల్లుడితో క‌లిసి శ్వేత‌సౌధం చేరుకున్నారు. రాబిన్సన్ 1960లో వివాహం చేసుకున్నారు. ఆమెకు మిచెల్ ఒబామా సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.