Prime Minister Narendra Modi - Vishvambhara News

2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో ఇవాళ(శుక్రవారం) నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తుచేశారు.

యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడానికి తన జీవితాన్ని ధారపోసిందని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని మోడీ ఉద్ఘాటించారు.

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్- ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ దేశాల అధ్యక్షులు వీరే..!
విశ్వంభర, ఢిల్లీః భారతదేశానికి మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ఇప్పటికే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ వేడుక రేపు అంటే జూన్ 9న రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగబోతుంది. కాగా ఈ వేడుకకు వివిధ దేశాల అధ్యక్షులకు ఆహ్వానం కూడా వెళ్లింది.

ఆహ్వానం అందుకున్న వారంతా ఇప్పటికే తమ రాకను ధృవీకరించారు. దాంతో ఢిల్లీలోని ప్రముఖ లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ లాంటి ప్రధాన హోటళ్ల దగ్గర అతిథులకు విడిది ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని, సీషెల్స్‌ అధ్యక్షుడు ఈరోజు న్యూఢిల్లీకి బయలు దేరారు.

మిగతా వారంతా రేపు సాయంత్రానికల్లా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

అయితే మోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు- రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు- మహ్మద్ ముయిజ్జూ, సీషెల్స్ ఉపాధ్యక్షుడు- అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని-షేక్ హసీనా, మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాన మంత్రి- పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధాని-షెరింగ్ టోబ్గే రాబోతున్నారు.

మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు
విశ్వంభర, పంజాబ్ : ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు. ‘ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో నేను రాజకీయ ఉపన్యాసాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాను. మోడీ అత్యంత దుర్మార్గపు విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారు.

అవి పూర్తిగా సమాజాన్ని విభజించే స్వభావం కలిగి ఉన్నాయి. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. తద్వారా ప్రధాని కార్యాలయ స్థాయి కూడా తగ్గింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ఇటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడలేదు’ అని తెలిపారు. ‘నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్’ అని పేర్కొన్నారు.

‘అగ్నిపథ్ స్కామ్ పై స్పందించిన మన్మోహన్.. దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవకు విలువ నాలుగేళ్లు మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. ఇది వారి బూటకపు జాతీయ వాదాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించబడే అభివృద్ధి-ఆధారిత భవిష్యత్తును కాంగ్రెస్ మాత్రమే నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహాతీతమైన గందరగోళాన్ని చవిచూసిందని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. కాబట్టి ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యానికి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి, సమ్మిళిత ప్రగతికి ఓటు వేయాలని పంజాబ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.