Kerala - Vishvambhara News

చికిత్స పొందుతూనే పాలనపై ఫోకస్‌.. కేరళ నుంచి పవన్‌ కీలక సమీక్షలు
Deputy CM Pawan Kalyan: వైద్యం కోసం ఈ నెల 22న కేరళకు వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. చికిత్స పొందుతూనే తన శాఖల పనితీరును అక్కడి నుంచే నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఆరోగ్య చికిత్స కొనసాగుతున్నప్పటికీ పాలనా వ్యవహారాలకు విరామం ఇవ్వకుండా ఫైళ్లను పరిశీలించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై కూడా అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ‘గుడి బాట’ కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలోని 100కుపైగా పుణ్యక్షేత్రాలకు సంబంధించిన సుమారు 205 కిలోమీటర్ల రహదారులను రూ.120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి ప్రాంతంలోని ఆలయ రహదారుల అభివృద్ధికి అదనంగా రూ.30 కోట్లు కేటాయించే అంశంపైనా చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు. గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ కార్యక్రమంలో భాగంగా 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలను నాటే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. చికిత్స కోసం కేరళలో ఉన్నప్పటికీ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. స్థలం మారినా బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదని, ప్రజల కోసం ఎక్కడ ఉన్నా పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపాయి.

ఉద్యోగులకు రూ.20 కోట్ల కార్ల కానుక
విశ్వంభర, నేషనల్ బ్యూరో: రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హైలైట్ గ్రూప్ తన ఉద్యోగుల పట్ల ఉదారత చాటుకుంది. సంస్థ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాలికట్‌లో నిర్వహించిన వేడుకల్లో యాజమాన్యం అదిరిపోయే కానుకలు ప్రకటించింది. కంపెనీ అభివృద్ధిలో వెన్నెముకగా నిలిచిన 47 మంది కీలక ఉద్యోగులకు ఏకంగా రూ.20 కోట్ల విలువైన ఖరీదైన కార్లను బహుమతిగా అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

1996లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానంలో మొదటి నుండి సేవలందించిన వారిని గుర్తించి ఈ గౌరవం కల్పించారు. పంపిణీ చేసిన వాహనాల్లో రేంజ్ రోవర్, ఆడీ క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి లగ్జరీ కార్లతో పాటు టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి. ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ భారీ వ్యయాన్ని భరించినట్లు యాజమాన్యం పేర్కొంది.

ప్రస్తుతం 10 వేల మంది ఉద్యోగులతో కొనసాగుతున్న హైలైట్ గ్రూప్ భవిష్యత్తుపై భారీ ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి సంస్థను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. త్రిశూర్, కాలికట్లలో ఇప్పటికే లగ్జరీ మాల్స్ నిర్వహిస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 మాల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. సుమారు 680 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే పట్టాలెక్కించనుంది.

కేరళ కాంగ్రెస్‌లో ‘థరూర్’ కలకలం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి. ఎన్నికల వ్యూహరచన కోసం ఢిల్లీలో నిర్వహించిన అత్యంత కీలకమైన సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటిస్తున్న సమయంలోనే, థరూర్ ఢిల్లీ భేటీకి వెళ్లకుండా కేరళలోనే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాహుల్‌తో పెరిగిన దూరం?
ఇటీవల కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై థరూర్ అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ తనతో సరిగా వ్యవహరించలేదని, ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని భావిస్తున్న థరూర్.. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన తన పట్ల రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర కలత చెందారని సమాచారం.

గతంలో పలుమార్లు ప్రధాని మోదీ పనితీరును థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు. కేరళ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు పిలిచిన భేటీని ఆయన దాటవేయడంపై చర్చ సాగుతోంది. అయితే, ఈ విమర్శలపై శశిథరూర్ కార్యాలయం స్పందించింది. రాజకీయ కారణాల వల్ల భేటీకి దూరం కాలేదని స్పష్టం చేసింది. కొలికోడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ లిటరేచర్ ఫెస్ట్ లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉన్నందున ఆయన కేరళలోనే ఉన్నారని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతల మధ్య సమన్వయం లోపిస్తే అది పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ
విశ్వంభర, నేషనల్ బ్యూరో: లైంగిక దాడి ఆరోపణల కేసులో చిక్కుకున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట‌తిల్‌ను విచారణ నిమిత్తం తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సిద్ధమైంది. పోలీసులు మొదట ఏడు రోజుల కస్టడీ కోరినప్పటికీ, వాదనలు విన్న అనంతరం కోర్టు కేవలం మూడు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా సాక్ష్యాలను సేకరించాలని, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

రాజకీయ వేటు..
2024 ఏప్రిల్ లో ఒక హోటల్‌లో తనపై ఎమ్మెల్యే రాహుల్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆందోళనల మధ్య కోర్టుకు..
తిరువల్ల తాలుకా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో DYFI, SFI, యువ మోర్చా కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్న మూడు రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బాధితురాలు పేర్కొన్న ప్రదేశాలకు ఎమ్మెల్యేను తీసుకెళ్లి విచారించనుంది. నిందితుడి ఫోన్ డేటా, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించనున్నారు.

వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా
విశ్వంభర నేషనల్ బ్యూరో: 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలంటే అది 'వికసిత్ కేరళ'తోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా ప్రారంభించారు. త్వరలో బీజేపీకి చెందిన నేత కేరళ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తిరువనంతపురం కీలక మైలురాయని అభివర్ణించారు. కేరళలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.

శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల వివాదంపై అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులు ప్రజల దృష్టిలో దోషులుగా ఉన్నారని, వారి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని అన్నారు. "శబరిమల ఆస్తులను కాపాడలేని వారు, మన నమ్మకాలను కాపాడలేరు" అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశమంతా ఆందోళనతో ఉందని చెప్పారు. కేరళ ఆర్థిక వ్యవస్థ కేవలం విదేశీ నిధులపైనే ఆధారపడకూడదని, ఇక్కడ సమగ్ర అభివృద్ధి జరగాలని అమిత్ షా సూచించారు. ప్రధాని మోదీ దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించారని, అటువంటి సమతుల్య అభివృద్ధి నమూనా కేరళకు అవసరమని పేర్కొన్నారు.

Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!!
Sabarimala Gold Theft Case: శబరిమల ఆలయంలో చోటు చేసుకున్న బంగారం తాపడాల చోరీ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ సంచలన కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది. సిట్ కార్యాలయంలో తెల్లవారుజామున సుమారు 4.30 గంటల నుంచి రెండు గంటల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం రాజీవరును కొల్లం కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 11కి చేరింది.

దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు రాజీవరుకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. శబరిమల ఆలయంలో బంగారు తాపడాల తొలగింపు, మళ్లీ అమరిక ప్రక్రియలో జరిగిన అక్రమాలకు రాజీవరు కూడా భాగస్వామిగా వ్యవహరించినట్టు విచారణలో తేలిన నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ తదితరులు, బంగారు పనుల కాంట్రాక్టును ఉన్నికృష్ణన్ పొట్టికి అప్పగించడంలో రాజీవరే కీలక పాత్ర పోషించారని తమ వాంగ్మూలాల్లో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ఈ సమాచారంతోనే రాజీవరును విచారణకు పిలిపించి, ఆధారాలు సేకరించిన అనంతరం అరెస్టు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2019లో శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాలు మరియు శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడాలను తొలగించి తిరిగి అమర్చే పనులు చేపట్టారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ముందున్న బంగారం బరువుతో పోలిస్తే కొత్తగా అమర్చిన తాపడాల్లో బరువు తేడా ఉందని పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరడంతో కేరళ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది.

సిట్ దర్యాప్తులో బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ ఈ కేసుకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తేలింది. దర్యాప్తు సమయంలో బెంగళూరులోని ఓ స్వర్ణాభరణాల దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ చేయడంతో కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని భావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసిన నిందితులపై ఈడీ కేసులు నమోదు చేసింది.

ఇలా శబరిమల బంగారం చోరీ కేసు రోజుకో కొత్త కోణంతో ముందుకు సాగుతుండగా, ఆలయ ప్రధాన అర్చకుడి అరెస్టు ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

కేరళను తాకనున్న రుతుపవనాలు.. రైతులకు చల్లటి కబురు
ఈ నెల చెదురుమదురు వర్షాలు పడినా.. ఎండ తీవ్రత మాత్రం విపరీతంగా ఉంది. గతంలో కంటే వడగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఇకపై ఈ ఇబ్బందికర పరిస్థితితులు తప్పనున్నాయి. వాతవరణ శాఖ రైతులు, ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవానాలు ఇవాళే కేరళ తీరాన్ని తాకనున్నాయి.

వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమం అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను నైరుతి తాకిన నాలుగు ఐదు రోజుల్లోనే ఆంధ్రా, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు. నైరుతి రాకతో మొదట దక్షిణాది రాష్ట్రాలు చల్లబడతాయి.

మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ కేంద్రం మే 15న ప్రకటించింది. కానీ.. రేమాల్ తుఫాన్ కారణంగా ఓ రోజు ముందుగానే వస్తున్నాయి. అంటే ఇవాళ సాయంత్రానికే రుతుపవానాలు తీరాన్ని తాకుతాయి.

గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం ఓరోజు ముందుగానే వస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలితే.. అంతే వేగంగా దేశం మొత్తం రుతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఐఎండీ.