Metro - Vishvambhara News

పాతబస్తీ మెట్రోపై హైకోర్టు కీలక ఆదేశం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనుల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన ఒప్పందాల వివరాలను కోర్టు ముందు ఉంచాలని మెట్రో నిర్మాణ సంస్థను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన స్పష్టమైన సమాచారంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. మెట్రో సంస్థ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ఈ నిర్మాణ ప్రక్రియలో కేవలం 3 పురాతన కట్టడాలను మాత్రమే కూల్చివేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

కోర్టులో జరిగిన వాదనలు

ప్రస్తుతం ఆస్తుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోందని ఏఏజీ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల ప్రకారమే ఆస్తుల సేకరణ పూర్తి చేస్తామన్నారు. కట్టడాల తొలగింపునకు సంబంధిత శాఖల అనుమతి కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. కమిటీ లేకుండా పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీ వివరాలను కిషన్ రెడ్డి ఈ లేఖలో వివరించారు. మెట్రో మొదటి దశను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం (Takeover) చేసుకుంటుందని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించాలంటే, ముందుగా మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, లావాదేవీలు, టేకోవర్ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

సంయుక్త కమిటీ ఏర్పాటులో జాప్యం
మెట్రో మలిదశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీ (Joint Committee) ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో ఈ కమిటీ ఏర్పడాలని, కేంద్రం తన వంతు ప్రక్రియకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
మెట్రో ఫేజ్-2పై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ అధికారుల పేర్లను ఎప్పుడు పంపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో మెట్రో విస్తరణ పనుల్లో ఉన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.

కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి: కేటీఆర్
హైదరాబాద్ వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన  మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 2016/17లో  ఆలోచన చేసినట్లు గుర్తుచేశారు. తాను  పీపీపీ విధానంలో పైలట్ ఎంఎల్‌సీపీ (మల్టీలెవల్ కార్ పార్కింగ్) ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు చక్కగా రూపుదిద్దుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

తాము అనుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలలో మరిన్నింటిని జోడిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, అరెకరం స్థలంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ముందుకు వెళ్లడంలేదు. సుమారు రూ.80 కోట్ల భారీ అంచనా వ్యయంతో దాదాపు 1,44,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దీన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇది జర్మన్ పాలిస్ పార్కింగ్ సిస్టమ్‌లో భారతదేశంలోనే మొట్టమొదటి కావడం విశేషం.

Had initiated a pilot MLCP (Multilevel Car Parking) project in a PPP mode near Nampally Metro Station back in 2016/17

Despite some teething problems and a bit of time delay, glad it’s finally shaped up well

Hope the Congress Govt will take this forward and add many more of… pic.twitter.com/UECwSfz6md

— KTR (@KTRBRS) May 19, 2024

హైదరాబాద్​ లో వర్షం... నవ్వుతున్న మీమ్ షేర్ చేసిన మెట్రో
విశ్వంభర, వెబ్ డెస్క్ : హైదరాబాద్, సికింద్రాబాద్  నగరంలో ఆకాల వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తుంటాయి. ఈ వరదలో వాహన దారులు, ప్రయాణికులు ముప్పుతిప్పలు పడుతూ..ట్రాఫిక్ ను ఎదుర్కొంటూ ఎట్టకేలకు తమ గమ్యానికి చేరుకుంటారు. తాజాగా కాసేపటి క్రితం జంటనగరాల్లో పలు చోట్ల వాన పడింది. అయితే దీనిపై మెట్రో వినూత్నంగా స్పందించింది.

హైదరాబాద్ లో వర్షం పడుతే ప్రయాణించే వారికి ఇప్పుడు పెద్ద ఇబ్బందేమీ కాదని, ట్రాఫిక్ ను అవాయిడ్ చేయాలని, స్టే డ్రై,ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా మెట్రోలో జర్నీ చేయొచ్చని తెలుపుతూ..ఓ ట్వీట్ చేసింది. అందులో అయ్యో ట్రాఫిక్ లో చిక్కుకు పోవాల్సిందే అని సహోద్యోగి బాధ పడితే మెట్రోలో వెళ్లే నేను ఇలా నవ్వుకుంటాను అంటూ బ్రహ్మానందం వీడియోతో మీమ్ చేసి ఎక్స్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతుంది.

Hyderabad rains are no match for your commute when you choose the Metro. Stay dry, avoid traffic, and breeze through your journey hassle-free.#landtmetro #HyderabadMetro #MetroRail #metrostation #skipthetraffic #metromoments #TimeOfYourLife #HyderabadRains pic.twitter.com/IcRaAougGs

— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 16, 2024

ఎన్నికలు పూర్తి.. కిక్కిరిసిన మెట్రో.. నేడు అదనపు సేవలు!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి. అయితే హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ కూడా వెంటనే హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. ఇలా ఓటర్లందరూ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్లడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి.

ఇక ఓటర్లందరూ కూడా ఓటు వేసిన వెంటనే హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ కూడా రద్దీగా మారిపోయింది. ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడంతో హైదరాబాద్ చేరుకున్నటువంటి పలువురు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం కోసం మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో కూడా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా విజయవాడ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ రద్దీగా మారిపోయింది.

ఇలా ప్రయాణికులు ఎక్కువగా మెట్రోని ఆశ్రయించడంతో ప్రతిరోజు ఆరు గంటలకు ప్రారంభం అయ్యే మెట్రో సేవలు నేడు అరగంట ముందే అనగా 5:30 కి ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్నటువంటి మెట్రో సంస్థలు అదనంగా మెట్రో సేవలను అందించబోతున్నట్లు వెల్లడించారు.