Government - Vishvambhara News

తెలంగాణలో గ్రామ పరిపాలన బలోపేతం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో గ్రామ పాలన అధికారి (GPO) వ్యవస్థను పునరుద్ధరిస్తూ, వీరికి సంబంధించిన సేవా నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 'తెలంగాణ గ్రామ పాలన అధికారి సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2025' పేరుతో ఈ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భర్తీ ప్రక్రియ రెండు విధాలుగా జరగనుంది. గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారులు (VROs), జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లలో క్రమబద్ధీకరించబడిన గ్రామ రెవెన్యూ సహాయకులను (VRAs) ఈ పోస్టుల్లోకి తీసుకోనున్నారు. మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

అర్హతలు, వయోపరిమితి
జీపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దిష్ట అర్హతలు నిర్ణయించారు. నేరుగా నియామకమయ్యే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బదిలీ ద్వారా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హతతో పాటు కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలి.  అభ్యర్థుల వయస్సు 18 నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం ఐదేళ్ల వయోసడలింపు కల్పించింది.

శిక్షణ - బాండ్ నిబంధన
ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. నేరుగా నియమితులైన వారు విధుల్లో చేరిన రెండేళ్ల లోపు పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ GPO, విలేజ్ మాన్యువల్ ఆఫ్ అకౌంట్స్, సర్వే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. శిక్షణ పూర్తయిన తర్వాత కనీసం మూడేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందిస్తామని బాండ్ సమర్పించాలి.

పదోన్నతులు -పర్యవేక్షణ
జీపీవోలుగా పనిచేస్తున్న వారికి భవిష్యత్తులో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పిస్తారు. జిల్లా కలెక్టర్ ఈ పోస్టులకు నియామక, క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ నిబంధనల అమలును భూపరిపాలన ప్రధాన కమిషనర్ పర్యవేక్షిస్తారు.

సమ్మక్కసాగర్ ముంపుపై ఛత్తీస్‌గఢ్ అప్రమత్తం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రవహించే బ్యాక్‌వాటర్ (వెనక్కి తన్నే నీరు) వల్ల తమ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ స్థాయికి చేరుకున్నప్పుడు ఏయే ప్రాంతాలు జలమయం అవుతాయో తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం అవసరమని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది.

సర్వే వ్యయం రూ. 9.88 కోట్లు

ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చును భరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్‌గఢ్ అధికారులు లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రభావాన్ని అంచనా వేయడానికి చేపట్టే సర్వే కోసం సుమారు రూ.9.88 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. సరిహద్దుల నిర్ధారణ, బ్యాక్‌వాటర్ ప్రవాహ దిశ, ప్రభావితమయ్యే గ్రామాల గుర్తింపు వంటి కీలక అంశాలపై ఈ సర్వే సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తామని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది.

పాత ఒప్పందాల అమలు

గతంలో సెప్టెంబర్ 22న ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన భేటీలో కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్ భూభాగంలో మునిగిపోయే భూములు, ఆస్తులు, గ్రామాల పునరావాసానికి సంబంధించిన అన్ని ఖర్చులను తెలంగాణ రాష్ట్రమే భరించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిబంధనల మేరకే సర్వే నిధులను ఛత్తీస్‌గఢ్ కోరుతోంది. ఈ అధ్యయన నివేదిక అందిన తర్వాతే ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి అనుమతులపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో విమానాల తయారీ
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో చిన్న మరియు డొమెస్టిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తయారీ చేపట్టనున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్య విమాన రాకపోకలను మరింత సులభతరం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది.  'ఉడాన్' వంటి పథకాల ద్వారా చిన్న నగరాలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తున్న క్రమంలో, ఎంబ్రయర్‌ వంటి సంస్థలతో భాగస్వామ్యం భారత రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల దేశంలో వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, విమాన ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుర్ఘటనపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదానికి కారణమైన భవన యజమాని సతీష్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో దుకాణ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఐదుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిద్ధమవుతున్నారు.

మంత్రుల దిగ్భ్రాంతి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. GHMC, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు కలిసి పనిచేసి నగరంలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు విజ్ఞప్తి
నగరంలోని ఏ భవనంలోనైనా అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని గుర్తిస్తే, తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. ప్రాణనష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా వంటి ప్రాణాంతక ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గుట్కా, పాన్ మసాలా, జర్ధా, ఖైనీ, నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై నిషేధం విధించింది.

ఒడిశాలో ప్రజారోగ్యంపై నిర్వహించిన ఒక తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఒడిశాలో సుమారు 42 శాతానికి పైగా పౌరులు సిగరెటేతర పొగాకు ఉత్పత్తులను వాడుతున్నట్లు తేలింది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే ఒడిశాలో ఈ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఈ ఉత్పత్తులే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది.

ప్రభుత్వ విజ్ఞప్తి
"పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. పొగాకు వల్ల కలిగే అనర్థాలను గుర్తించి, ప్రజలందరూ వీటికి దూరంగా ఉండాలి. పొగాకు రహిత ఒడిశా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని ఆరోగ్య శాఖ తన నోటిఫికేషన్‌లో విజ్ఞప్తి చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు
విశ్వంభర బ్యూరో: బ్రిటన్‌లోని పౌరులు, శాశ్వత నివాసులకు సంబంధించి వివాదాస్పదంగా మారిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డుల ప్రతిపాదనపై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఉద్యోగం పొందాలంటే డిజిటల్ ఐడీ తప్పనిసరి అనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు సమాచారం. దేశంలో అక్రమ వలసలను కట్టడి చేసే లక్ష్యంతో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. బ్రిటన్‌లో ఎవరైనా పనిచేయాలంటే ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ ఐడీ ఉండాల్సిందేనని, ఇది లేకుంటే ఉపాధి లభించదని గతంలో ప్రధాని ప్రకటించారు. ఈ విధానం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ప్రజా వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్
అయితే, ఈ డిజిటల్ కార్డుల విధానంపై బ్రిటన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 30 లక్షల మంది పార్లమెంటరీ పిటిషన్‌పై సంతకాలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన భారీ వ్యతిరేకతను గమనించిన స్టార్మర్ ప్రభుత్వం, ముందడుగు వేయడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం
25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : -  మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్  అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు  అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బిజెపి కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి రైతులకు చిరువ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నామమాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరుగ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి బాబు  జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాసు. స్టేట్ కౌన్సిల్ మెoబర్ ఏలేటి నరేందర్ రెడ్డి .బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ .బిజెపి కౌన్సిలర్ మర్రి  పోచయ్య. బీజేవైఎం పట్టణ కన్వీనర్ సుంకేట విజయ్ .మద్దెల  లావణ్య .పుల్ల సౌజన్య. నూనె క్రాంతి .దేవ రాజ్యం.కలాలి రాజిరెడ్డి. తోకల సత్యనారాయణ. బోడ్ల ఆనంద్. తిరుమల్ .భీమనాతి విజయ్. రూపేష్ .తోట ప్రసాద్. ఆనంద్. కృష్ణమూర్తి .దత్తు.ఉమేష్.రాకేష్ మారుతి. వివేక్ మారుతి అనిల్. మల్లేష్ కుమార్ .శీను.బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇంచార్జిలు పట్టణ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు
రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రూ. 2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది.

జులై 15 నుంచి రూ. 50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు,  రూ. లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. అయితే, నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవనున్నట్లు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 22.50లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్‌గా మారనుంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.

మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలి: చంద్రబాబు
రాష్ట్రంలో జరుగుతోన్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.

రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏజెన్సీలు యువతను మోసం చేశాయన్నారు. ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడినట్లు తెలిపారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.