crime - Vishvambhara News

విడాకులు ఇచ్చిందని మాజీ భార్య దారుణ హత్య
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ శివారు వనస్థలిపురంలో బుధవారం పట్టపగలే ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో విడిపోయి రెండో వివాహం చేసుకుందన్న కక్షతో సునీత అనే మహిళను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా చంపేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సునీత నివాసానికి వెళ్లిన మహేష్.. వెంట తెచ్చుకున్న కత్తులతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కేవలం కత్తులే కాకుండా, వెంట పెట్రోల్ డబ్బాను లోపలికి వెళ్లాడు.

విడత రాని విద్వేషం.. రెండో పెళ్లిపై కక్ష
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సునీతకు గతంలోనే మహేష్‌తో వివాహమైంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితమే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం సునీత మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటోంది. విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్న మహేష్.. తనను మోసం చేసిందని, విడిపోయి మరొకరితో ఎలా ఉంటుందని తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

నిందితుడిని పట్టుకున్న స్థానికులు
హత్య చేసిన అనంతరం అపార్ట్‌మెంట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న మహేష్‌ను స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకున్నారు. అతడిని పట్టుకుని వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మహేష్ తన నేరాన్ని అంగీకరించాడని, సునీత రెండో వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకే ఈ హత్య చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

లాయర్ స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న(34) దారుణ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన సొంత చెల్లెలిని చంపేందుకు అన్న రాజు పన్నిన ప్లాన్ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న కదలికలను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసిన శేఖర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం
విచారణలో షాకింగ్ నిజాలు ఒప్పుకున్న రాజు, హత్యకు ముందు స్వప్నను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలిపాడు. మొదటిసారి కారుతో స్వప్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. రెండోసారి బుల్డోజర్‌తో స్వప్నను ఢీకొట్టించి, ఆ ప్రమాదంలో ఆమె మరణిస్తే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అయితే, స్వప్న అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రమాదాల నుండి ప్రాణాలతో బయటపడింది.

సీసీ కెమెరాలు లేని ప్రదేశాల కోసమే వేట
సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ముందే గుర్తించిన రాజు, ఆ ప్రదేశాల్లో స్వప్నను వాహనాలతో వెనుక నుండి ఢీకొట్టాలని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ సక్సెస్ చేయడం కోసం తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడు. గతంలో నమోదైన ఈ రోడ్డు ప్రమాద కేసులను ఇప్పుడు పోలీసులు హత్యాయత్నం కేసులుగా మార్చనున్నట్లు వెల్లడించారు.

ఆన్‌లైన్ గేమింగ్.. రూ.5వేల కోట్ల భారీ కుంభకోణం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్‌’ గుట్టును హైదరాబాద్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఏకంగా రూ.5,000 కోట్ల విలువైన ఈ అక్రమ సామ్రాజ్యంపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ భారీ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ప్రధాన సూత్రధారులుగా ముంబయికి చెందిన వైఎస్‌ ప్రభుకుమార్‌, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డిని అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి దేశవ్యాప్తంగా ఒక పకడ్బందీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం.. ఒకేసారి మూడు ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన పత్రాలు, అక్రమ లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్నా, పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తీరును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా, ఈ లావాదేవీల వెనుక మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే మరిన్ని కీలక వివరాలు, అలాగే ఈ సిండికేట్‌లో భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు బయటపెడతామని అధికారులు వెల్లడించారు.

400 మీటర్ల దూరానికి రూ. 18 వేలు వసూలు!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అథితి దేవోభవ అనే మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం 400 మీటర్ల ప్రయాణానికి ఒక విదేశీ పర్యాటకురాలి వద్ద నుంచి ఏకంగా రూ. 18,000 వసూలు చేసిన ఘరానా మోసం బయటపడింది. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ముంబయి పోలీసులు కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని జైలులోకి పంపించారు.

అసలేం జరిగింది?
అర్జెంటీనా అరియానో అనే పేరుతో ఉన్న 'ఎక్స్' ఖాతాలో బాధితురాలు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె.. స్టార్ హోటల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ ఎక్కారు. డ్రైవర్, మరో వ్యక్తి కలిసి ఆమెను మొదట దారి మళ్లించి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. భయబ్రాంతులకు గురిచేసి ఆమె నుంచి రూ.18,000 వసూలు చేశారు. ఆ తర్వాత కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్ వద్ద ఆమెను దించి వెళ్లిపోయారు. బాధితురాలు ఆ ట్యాక్సీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు.

3 గంటల్లోనే అరెస్ట్
ఈ పోస్టును సుమోటోగా స్వీకరించిన ముంబయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గాలింపు చేపట్టారు. ట్యాక్సీ నంబర్ ఆధారంగా నిందితుడు దేశరాజ్ యాదవ్‌ను కేవలం మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దేశరాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ మహిళను అంధేరీ ఈస్ట్ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాల పాటు అడ్డదిడ్డంగా తిప్పి, చివరకు ఆమె వెళ్లాల్సిన హోటల్ పక్కనే దింపినట్లు ఒప్పుకున్నాడు.  దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

రూ.26వేలకే కారు అంటూ ప్రకటన.. వ్యాపారి అరెస్ట్
విశ్వంభర, క్రైం బ్యూరో:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్ ఇస్తానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పాత కార్ల వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం వ్యాపార ప్రచారం కోసం తప్పుడు వాగ్దానాలు చేసి శాంతిభద్రతల సమస్యకు కారణమైనందుకు ఈ చర్య తీసుకున్నారు. మల్లాపూర్‌కు చెందిన రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో "రిపబ్లిక్ డే స్పెషల్: కేవలం రూ. 26,000కే కారు" అని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా అటువంటి 50 కార్లు సిద్ధంగా ఉన్నాయని పోస్ట్ చేయడంతో, ఆశావహులు సోమవారం తెల్లవారుజాము నుండే షాపు ముందు బారులు తీరారు.

జనం భారీగా రావడంతో భయపడిన రోషన్, తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని, మిగతావి లేవని చేతులెత్తేశాడు. దీంతో వేల సంఖ్యలో తరలివచ్చిన జనం తాము మోసపోయామని గ్రహించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు షాపులోని కార్లపై రాళ్లతో దాడి చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను వంచించినందుకు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నమ్మశక్యం కాని ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు
రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలిక లోదుస్తులు తొలిగించి.. బాలిక ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అనేది అత్యాచార యత్నం కాదని తెలిపింది. అత్యాచార యత్నం కేసులో 33ఏళ్లకు తీర్పు చెప్పింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 1991లో రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పరిధిలో ఆరేళ్ల బాలిక రాత్రి 8గంటలకు నీళ్లు తాగడానికి వెళ్లగా సువాలాల్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెళ్లి ఆ బాలిక లోదుస్తులు తొలిగించాడు.

సువాలాల్ కూడా దుస్తులు విప్పేసి నగ్నంగా మారాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితున్ని పోలీసులకు పట్టించారు. ఈ కేసుపై 33 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడగా రాజస్థాన్ హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. ‘బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఉండటం అత్యాచార యత్నం కాదు’ అని తెలిపింది.

కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి
రహదారిపై కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతులను వెంకటేశ్‌ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్‌ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
విశ్వంభర, మహబూబాబాద్ :  అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.  ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు సమిధులవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది.

బత్తిని మనోహర్ (50) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంలో  హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పులు పెరిగిపోయాయి. వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక.. అప్పుల వాళ్ల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నరసింహా నగర్‌లో మనోహర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు బాధతో గతకొంత కాలంగా మనోవేదన చెందుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. తోటి ఉద్యోగులు కూడా కొన్ని రోజుల నుంచి మనోహర్ డల్ గా ఉంటుంన్నాడని తెలిపారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మనోహర్ కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. ఇటీవల అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఆత్మహత్యలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐనాంగూడా దగ్గర ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైకును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై తన రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం.. చుట్ట జనాలు రావడం.. రక్తం మడుగులో పడి ఉండటం చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఆ రెండేళ్ల చిన్నారికి అర్థం కాలేదు. ఏ చేయాలో తెలియక రెండేళ్ల బాబు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న బాబును చూసిన వారికి కూడా కన్నీళ్లు ఆగలేదు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరుకి చెందిన ప్రసాద్ గా గుర్తించారు. ఏదైనా పని వెతుకుంటూ జీవనం సాగించడానికి వారం రోజుల క్రితం ఇనాంగూడా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చినపుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం అతివేగంతో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ స్పాట్ లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.

జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు అఖిల వెంట పడేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఆమె వెంట పడేవాడు. ఈ విషయం అఖిల తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. అఖిల కుటుంబ సభ్యులు అఖిల్ సాయిగౌడ్‌ను పిలిచి మాట్లాడారు. అఖిలను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.

ఈ వ్యవహారం మొత్తం 8 ఏళ్లుగా నడుస్తోంది. అయితే.. గత నాలుగు నెలలుగా అఖిలకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి రోడ్డుపైనే కొట్టేవాడు. దీనికి తోడు.. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో.. ఆమె మోసపోయానని ఆవేదనతో 14 పేజీల లేటర్ సారి ఉరివేసుకుని చనిపోయింది. తమకు న్యాయం చేయాలని అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలో యాదగిరిగుట్ట యువతి మృతి
విశ్వంభర, యాదగిరిగుట్ట : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన గుంటపల్లి కోటేశ్వరరావు, గుంటపల్లి బాలమణిల కూతురు గుంటపల్లి సౌమ్య (24) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అయితే ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అమెరికాలో చదువుతోపాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని యాదగిరిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి  ఎదుగుతుందనుకున్న యువతి మృతి చెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.