అర్థనగ్నంగా వాలీబాల్ ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు

అర్థనగ్నంగా వాలీబాల్ ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు



టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో విజయం సాధించింది. దాంతో మన టీమ్ తదుపరి దశ అంటే సూపర్-8 కు చేరుకుంది. సూపర్-8 మ్యాచ్ ల కోసం బార్బడోస్ కు చేరుకుంది. ఇక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేందుకు రెడీ అవుతోంది మన టీమ్ ఇండియా.

కాగా ఈ మ్యాచ్ కు రెడీ అయ్యేందుకు టీమ్ ఇండియా ఇప్పటికే బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు మన టీమ్ ఇండియా ఆటగాళల్ఉ బీచ్ లో తెగ ఎంజాయ్ చేశారు. బార్బడోస్ చేరుకున్న తర్వాత బీచ్ లో అంతా తేలారు. అక్కడ ఆటగాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయారు. 

వారంతా కూడా మరో ఆట ఆడారు. అదేనండి వాలీవాల్. కాకపోతే ఇందులో ఎవరికీ షర్టులు లేవు. కేవలం షార్ట్స్ వేసుకుని అందరూ ఇలా అర్థనగ్నంగా ఆడారన్నమాట. అయితే వీరంతా క్రికెట్ కు కాసేపు విరామం ఇవ్వాలనే నెపంతోనే ఇలా కాసేపు టైమ్ పాస్ చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.