హైఓల్టేజీ సమరానికి సై.. నేడే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఇవాళ(ఆదివారం) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఇవాళ(ఆదివారం) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు పోరుకు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ స్టేడియం వేదికైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ హైఓల్టేజీ సమరాన్ని చూసేందుకు అభిమానులు తగ్గేదే లే అంటున్నారు. టిక్కెట్ల భారీ ధరను భారీగా పెంచినప్పటికీ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్టేడియానికి చేరుకుంటున్నారు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కలిగి ఉన్న ఈ స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన అదే దూకుడు మీద ఉండగా పాక్ జట్టు యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌తో నిరాశలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశముంది.
ప్రపంచ కప్‌లో దాయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే టీమిండియా జట్టులో అక్షర్ బదులుగా కుల్దీప్ రానున్నట్లు సమాచారం. టీమిండియా: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్ లేదా కుల్దీప్, బుమ్రా, అర్దీదీప్, సిరాజ్. పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఉస్మాన్, జమాన్, ఆజమ్, ఇఫ్రికార్, షాదాబ్ లేదా ఆయూబ్, ఆఫ్రిది, నసీమ్, ఆమిర్, రవూఫ్ లు ఉండవచ్చని అంచనా.