యూఎస్ జట్టులో 8 మంది భారత సంతతి వారే..
ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న యూఎస్ టీమ్ ను మినీ ఇండియా టీమ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జట్టులో ఉన్న ఎనిమిది మంది కీలక ఆటగాళ్లు మన ఇండియా సంతతికి చెందిన వారే కావడం విశేషం. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి.
న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్కాబోతోంది. ఇందులో గెలిస్తే ఇండియా టీమ్ కు సూపర్-8 బెర్త్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు అక్కడకు వెళ్లకుండా ఇండియా టీమ్ కు మరో మినీ ఇండియా టీమ్ అడ్డుపడుతోంది. అదేనండి యూఎస్ టీమ్.
ఇప్పుడు యూఎస్ టీమ్ లో ఉన్న కెప్టెన్ సహా మిగతా ఏడుగురు మనవాళ్లే. కెప్టెన్ మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, జస్‌దీప్ సింగ్, నోస్తుష ప్రదీప్ కెంజిగె, నితీశ్ కుమార్ భారత క్రికెటర్లే. వీరితో పాటు పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లు కూడా ఇప్పుడు యూఎస్ టీమ్ లో ఆడుతుండటం విశేషం.