...ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలి
...నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
...సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి
విశ్వంభర చింతపల్లి జులై 20 : - దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ పట్టణ నిర్మాణ కౌన్సిల్ సమావేశం కామ్రేడ్ పల్లా పర్వత్ రెడ్డి భవన్ లో కామ్రేడ్ నీలా వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పల్లా నర్సింహారెడ్డి హాజరై మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం కమిషన్ ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద శ్రద్దతో కాలయాపన చేసి నల్లగొండ జిల్లా ప్రాజెక్టు లను గాలికొదిలేసిందని అన్నారు.నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో సొరంగమార్గం టన్నెల్ పనులు పూర్తి దశలో ఉండగా బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 కిలోమీటర్లు పూర్తి చేయడానికి శ్రద్ద చూపలేదని అన్నారు. ఎస్ఎల్బిసీ, నక్కల గండి ప్రాజెక్టు లను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం శుభ పరిణామమని ప్రజా, రైతు ఆకాంక్షల మేరకు ప్రారంభించిన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ ఆయన కోరారు. డిండి లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని డిండి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీటినందించాలని రైతు భరోసా విడుదల చేసి వర్షాకాలం పంటలకు రైతులను ఆదుకోవాలని వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లు పెంచిన వెంటనే అమలు చేయాలని రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ఇండ్లు ఇళ్లస్థలాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని రైతు భీమా అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేసి తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, జిల్లా సమితి సభ్యులు వలమల్ల ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు, సహాయ కార్యదర్శులు పగిళ్ళ బుచ్చయ్య, తోటపల్లి నాగేష్, కౌన్సిల్ సభ్యులు ఎండి మైనొద్దీన్, ఏషామోని మల్లేష్, కందుకూరి శ్రీను, జూలూరి జ్యోతిబస్, లింగంపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి గెల్వయ్య, పుప్పాల గిరిప్రసాద్, పర్వతం శ్రీను, నీలా అనసూయ, పద్మ, జాకీర్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు