సూర్యాపేట మున్సిపాలిటీ లో గాడి తప్పిన అధికారుల పాలన
సిబ్బంది పై పట్టు తెచ్చుకోలేకపోతున్న కమిషనర్టెం
టెండర్ వేసిన ఓపెన్ చేయలేని స్థితి లో ఉన్న మున్సిపల్ కమిషనర్*
ఎక్కడ వేసినా గొంగడి అక్కడే చందంగా సూర్యాపేట మున్సిపాలిటీ*
ఏం ఎల్ ఏ ఉన్నా లేన్నట్టేనా!
జర దేఖో మినిస్టర్ సాబ్
*మున్సిపాలిటీపై v3 న్యూస్& విశ్వంభరా ప్రత్యేక కథనం*
విశ్వంభర, సూర్యాపేట:- మున్సిపాలిటీ రోజు, రోజుకు పేరుకు పెద్ద ఊరికి దిబ్బల తయారు అయింది. అధికారుల పాలన అస్తవ్యస్తం అయిందనీ ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి..ప్రధాన సమస్య నేడు నీటి సమస్య ఒక వార్డ్ కు 5 రోజుల నుండి నల్ల అంతగా రావటం లేదనీ ప్రజలు అంటున్నారు.ఆనాడు ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నల్ల రావటం లేదు అని కనీసం సాధారణ ప్రజానికానికి సమాచారం ఇచ్చేవారు... ఇప్పుడు సమాచారం అనేది అధికారులు మర్చిపోయినట్లు ఉందని వాపోతున్నారు...
*ప్రజల సమస్యలు పరిష్కారాలు అధికారులకు పట్టవా*?
ఇటీవల సూర్యపేట కమిషనర్ కి బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సిబ్బందినీ కూడా కమిషనర్ పట్టు తెచ్చుకోకపోవటంతో ఏ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏక్కడ ఏ పని చేస్తున్నారు ? తెలియనిదిగా ఉంది.
*మున్సిపల్ జేసీబి ల సంగతి సంగతే*
మున్సిపల్ జేసీబి ల సంగతి సంగతే. అవి ఎప్పుడూ పని చేస్తాయో?ఎప్పుడు పని చేయవో ? తెలియనీ అయోమయ పరిస్థితి నెలకొంది. చైన్ జెసిబి ఉన్న ఆపరేటర్ లేక పెద్ద నాళాలలో చెత్త వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి.
కాగా ప్రతి దానికి నోట్ ఫైల్ కావాలి అనే కొత్త కమిషనర్ కి ఇవి ఏం పట్టవా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
*టెండర్లు ఎటు పోయే*
కొన్ని ప్రజా అవసరాల పనులు కోసం టెండర్ లు వేసారు. కాగా అవి ఓపెన్ చెయ్యోద్దు. డబ్బులు లేవు అని హుక్కం జారి చేస్తున్న కొత్త కమిషనర్. మరి ప్రజల ఇబ్బందులు ఎలా తీరుస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది.
*ఏం ఎల్ ఏ ఉన్నా లేన్నట్టేనా!*
ఏం ఎల్ ఏ గెలిపించిన ఎమ్మెల్యే కనీసం సూర్యాపేట మున్సిపాలిటీ పై కన్నెత్తి కూడా చూడకపోవటం, పట్టించుకోకపోవటంతో ఈ పరిస్థితి దాపురించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
*జిల్లా మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి*
జిల్లా మంత్రి గారు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టీ కోదాడ,హుజుర్నగర్,నేరుడుచర్ల మున్సిపాలిటీలే కాక,సూర్యాపేట గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉంది అని గుర్తించి సూర్యాపేట మున్సిపల్ ప్రజల అవసరాలను, పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు



