మోడీకి మద్దతుగా వారణాసిలో పూజలు

మోడీకి మద్దతుగా వారణాసిలో పూజలు

నరేంద్ర మోడీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నరేంద్ర మోడీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారణాసిలో ఆదివారం ఉదయం భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగింది. మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు గంగా హారతి ఇచ్చారు. 

ఈ సందర్భంగా గంగాహారతి పాటలు పాడుతూ భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. మోడీ ఇవాళ సాయంత్రం 7.15గంటలకు భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వారణాసి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వారణాసిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో అధికారులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts