సరదా కోసం బాలుడి తుంటరి పని.. చివరకు జైలుకు
విమానంలో బాంబ్ ఉందని బెదిరింపులు
అధికారుల ఉరుకులు, పరుగులు
ఓ బాలుడు సరదా కోసం చేసిన పని చివరకు అతని అరెస్ట్ కు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన బాలుడు ఈ పని చేశాడు. ఢిల్లీ నుంచి టొరంటో వెళ్తున్న ఎయిర్ కెనడా విమానంలో బాంబ్ ఉందని ఫేక్ మెయిట్ పంపాడు. దాంతో అధికారులు ఉరుకులు, పరుగులతో నానా హైరానా పడ్డారు.
దాంతో విమానం దాదాపు 12 గంటలకు పైగా ఆలస్యం అయింది. ఎలాంటి బాంబ్ లేదని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత అసలు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టారు. మీరట్ నుంచి ఓ 13 ఏళ్ల బాలుడు ఈ పని చేసినట్టు గుర్తించారు. టీవీల్లో నకిలీ బాంబ్ కాల్స్ సీన్లు చూసిన అతను.. తాను కూడా అలా చేయాలని అనుకున్నాడు.
ఇందుకోసం ఓ ఫేక్ మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాడు. తన ఫోన్ నుంచి ఈ మెసేజ్ పెట్టాడు. అది గుర్తించిన పోలీసులు.. ఢిల్లీ నుంచే అతనితో మాట్లాడారు. అయితే తర్వాత రోజున బాలుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కేవలం సరదా కోసమే చేశానని.. తనను పోలీసులు కనుక్కుంటారో లేదో చూడటం కోసం ఇలా చేశానని సదరు బాలుడు తెలిపారు.