రేపు ముగియనున్న కవిత కస్టడీ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

రేపు ముగియనున్న కవిత కస్టడీ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ సోమవారం విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ, సీబీఐ.. కవితను కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. 

 

Read More పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అయితే.. ఆమెను వర్చువల్‌గా హజరు పరుస్తారా? లేకపోతే వ్యక్తగతంగా కోర్టుకు తీసుకెళ్లాలా అనే అంశంపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. ఈ విషయంపై జైలు అధికారులు రేపు నిర్ణయం తీసుకుంటారు. మార్చి 26 నుంచి కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతంలోనే కవిత కస్టడీ ముగిసింది. కానీ కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 

 

Read More పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. దీంతో.. రేపు కవిత కస్టడీపై తీర్పు ఉత్కంఠ రేపుతోంది. కవితతో పాటు.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‌పై కూడా రేపే విచారణ జరగనుంది.