65శాతం రిజర్వేషన్ల పెంపు చెల్లదు.. బీహార్ హైకోర్టు సంచలన తీర్పు
బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. రాజకీయాల కోసం పెంచిన రిజర్వేషన్ల చట్టం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. ఈ మేరకు నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నాయి.
ఇక ఓపెన్ మెరిట్ కేటగిరీ నుంచి వచ్చేవారికి మాత్రం 35 శాతానికి పరిమితం చేసింది. మొత్తం ఈ రిజర్వేషన్లు, ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్లతో కలిపితే 75 శాతం అవుతున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై చాలా మంది కోర్టుల్లో కేసులు వేశారు. విచారించిన కోర్టు రిజర్వేషన్ల పెంపు చెల్లదంటూ రద్దు చేసింది.
ఈ పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. సమానత్వాన్ని తుంచివేస్తున్నాయని తెలిపింది. ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. కాబట్టి ఇవి సమాజానికి మంచివి కావంటూ తెలిపింది కోర్టు. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా నితీష్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.