నెట్ రద్దు.. నీట్ కాదు
- యూజీసీ నెట్-2024 రద్దు
- నీట్ రద్దు చేశారంటూ ప్రచారం
- అయోమయంలో విద్యార్థులు
కేంద్ర విద్యాశాఖ తాజాగా యూజీసీ నెట్-2024 (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను రద్దు చేసింది. అయితే నీట్(NEET) ఎన్ఈఈటీ), నెట్(NET) పేర్లు దాదాపు ఒకే రంగా ఉండటంతో చాలా మంది నీట్ రద్దు చేశారని అయోమయానికి గురవుతున్నారు. కేంద్రం రద్దు చేసింది మాత్రం నెట్ మాత్రమే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం నెట్ నిర్వహిస్తే నెట్ నిర్వహించగా బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లోఅడ్మిషన్లకు నెట్(ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో 8వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
ప్రతీ సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ‘నీట్’ పరీక్ష రాస్తుంటారు. 2017లో సుమారు 12లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తాజాగా 2024 మే 5న నీట్ పరీక్ష జరిగింది. అయితే ఆ పరీక్ష జరిగిన నెల రోజులకే నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందుగానే జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల ఫలితాల హడావుడిగా ఫలితాలు రావడంపై పలు అనుమానాలకు దారితీసింది. నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈసారి 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి.
హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720 మార్కులు రావడం చర్చనీయాంశమైంది. ఇంతమంది విద్యార్థులు టాప్ ర్యాంకులను సాధించడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి గ్రేస్ మార్కులే కారణమని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80మార్కులు కలిపారని పేర్కొన్నారు. అయితే, నీట్ పరీక్ష అందరూ అనుకున్నట్లే రద్దవుతుందా? దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనేది తెలియాల్సివుంది.