సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు

కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ, అనంతరం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎందరో అధికారులను చూశానని, కానీ ఇంతటి అహంకారిని, అబద్ధాల కోరును తన జీవితంలో చూడలేదని మండిపడ్డారు.

బెంగాల్‌పై వివక్ష ఎందుకు?
సమీక్షా సమావేశంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ.. "నేను ఢిల్లీ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నాను. నాలుగు సార్లు కేంద్ర మంత్రిగా, ఏడు సార్లు ఎంపీగా పనిచేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను.. మీ కుర్చీకి నేను గౌరవం ఇస్తాను కానీ, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ప్రవర్తన సరిగా లేదు. ఎవరో ఒకరోజు ఆ కుర్చీని వదిలిపెట్టాల్సిందేనని వారికి ముఖం మీదే చెప్పాను" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కాకుండా కేవలం బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో పండుగలా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను పక్షపాతపూరితంగా మారుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 58 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, ఇది తీవ్రమైన వివక్ష అని మమతా ఆరోపించారు. ఓటర్ల తొలగింపుపై కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదని, ఇది పక్షపాతపూరిత చర్య అని మండిపడ్డారు. ఒక వర్గాన్ని లేదా ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read More ఆమెకు అఫైర్లు ఉన్నాయి..!!