ప్రభుత్వంపై హీరో సూర్య పరోక్ష విమర్శలు 

ప్రభుత్వంపై హీరో సూర్య పరోక్ష విమర్శలు 

  • కల్తీసారా తాగి 50మంది మృతిచెందిన ఘటనపై స్పందన
  • గతేడాది 22 మంది మృతిచెందినా ఏమార్పు లేదంటూ వ్యాఖ్య
  • ఎక్స్ వేదికగా హీరో సూర్య ట్వీట్

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కల్తీసారా దుర్ఘటనలో 50మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ హీరో సూర్య ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఆయన తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేస్తూ కల్తీసారా ఘటనలో మరణాలపై దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూనే ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సూర్య తన ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. 

‘‘చిన్న ఊరులో 50 మరణాలు తుపాను, వరదలు వంటి విపత్తు కాలాల్లోనూ చోటుచేసుకోని విషాదం.  వరుసగా పెరుగుతున్న మరణాలు, బాధితుల ఆక్రందన మనసును వణికిస్తున్నాయి.  గతేడాది విళుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన కల్తీసారా తాగి 22మంది మృతిచెందగా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. ప్రస్తుత ఘటనతో నిరూపితమైంది. ప్రభుత్వాలు టాస్మాక్ దుకాణాల ద్వారా ప్రజలను మద్యం తాగిస్తున్న దుస్థితి నెలకొంది. అందులో రూ.150ఖర్చుపెట్టి తాగేవాళ్లు డబ్బు లేనప్పుడు రూ.50కు కల్తీసారా తాగుతున్నారు. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు.. ఓ కుటుంబ సమస్య.. సమాజ సమస్య. మద్యనిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్నితీసుకుంటారని ఆశిస్తున్నా.’’ అంటూ సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..