ఇండియన్ ఆర్మీ చీఫ్‌ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

ఇండియన్ ఆర్మీ చీఫ్‌ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

 

ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ గా ఉన్నారు. గతేడాది నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతుండగా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పుట్టి పెరిగింది మధ్య ప్రదేశ్ లోనే.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

ఆయన చిన్నప్పుడు సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1984లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లోని 18 బెటాలియన్‌లో చేరారు. కశ్మీర్‌ లోయతో పాటు రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. దాంతో పాటు అటు కశ్మీర్ లోయల్లో కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 

ముఖ్యంగా ఎన్నో సార్లు పాకిస్థాన్ టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు చాలా రకాల ఆపరేషన్లు చేపట్టారు. చైనా, పాకిస్థాన్ ఆర్మీని కట్టడి చేయడంలో ఆయన దిట్ట. పైగా కాశ్మీర్ మీద ఆయనకు పూర్తి స్థాయిలో పట్టు ఉంది. అక్కడ టెర్రరిజాన్ని అంతం చేయాలంటే ద్వివేది అయితేనే బెటర్ అని ఇండియా ప్రభుత్వం భావించి ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

Related Posts