ఐసీయూలో తండ్రి.. ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న కూతుర్లు
ఆ తండ్రి కోరిక నెరవేర్చడానికి కూతుర్లు ఏకంగా ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్నారు. తండ్రి ఐసీయూలో ఉండటంతో.. చావుబతుకుల నడుమ కుమార్తెల పెళ్లి చూడాలనే కోరికను వారు ఇలా నెరవేర్చారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల జునైద్ మియాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
దాంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇచ్చారు. కాగా అంతకు ముందే కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి సంబంధాలు కుదిరాయి. మరికొన్ని రోజుల్లో వివాహం ఉండగా ఇలా జరిగింది. దాంతో కుమార్తెలు తమ పెళ్లి చూడాలన్న తండ్రి కోరికను నెరవేర్చాలని అనుకున్నారు. దీంతో ముంబైకి చెందిన వరులు లక్నో చేరుకున్నారు.
ఆదివారం జునైత్ కుమార్తెలు, వరులు నిఖా జరిపే మత పెద్ద, ఒకరిద్దరు బంధువులు మెడికల్ దుస్తులు ధరించారు. ఐసీయూలో తండ్రి ముందు పెళ్లి చేసుకున్నారు. ఇదంతా బంధవులు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దాంతో తండ్రి కోరికను నెరవేర్చిన ఆ నలుగురిని అందరూ అభినందిస్తున్నారు.