మొత్తం బలగాలను దించండి.. ఉగ్రవాదులను ఏరిపారేయండిః ప్రధాని మోడీ

మొత్తం బలగాలను దించండి.. ఉగ్రవాదులను ఏరిపారేయండిః ప్రధాని మోడీ

 

అజిత్ దోవల్ కు ఆదేశాలు
హోంశాఖ మంత్రితో చర్చలు
ఆయుధాలు, సైనికులను తరలించాలని ఆదేశం

 

జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. అసలు అక్కడ భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనే విషయంపై ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై భేటీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో గత నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

మొదటి రోజు ఓ బస్సు మీద దాడి చేయగా.. ఏకంగా 9 మంది చనిపోయారు. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉండటంతో మోడీ శుక్రవారం అజిత్ తో సమావేశం నిర్వహించారు. అవసరం అయితే ఈ దాడులను ఆపేందుకు పూర్తి స్థాయిలో సాయుధ బలగాలను అక్కడ మోహరించాలని చెప్పారు. 

ఆయుధాలు, సైనికుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. దాడులను ఆపడమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. పూర్తి స్థాయిలో అక్కడ ఉగ్రవాదులను ఏరిపారేయాలంటూ ఆదేశించారు నరేంద్ర మోడీ. దీనిపైనే మోదీ అమిత్ షాతో కూడా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై సమాచారం తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Related Posts