యూజీసీ నెట్ పేపర్ లీక్‌లో మరో సంచలనం

యూజీసీ నెట్ పేపర్ లీక్‌లో మరో సంచలనం

  • టెలిగ్రామ్‌లో లీక్ అయిన యూజీసీ నెట్ పేపర్
  • రూ.5వేల నుంచి 10వేలకు అమ్ముడుపోయిన క్వశ్చన్ పేపర్

యూజీసీ, నెట్, నీట్ పరీక్షలకు సంబంధించిన ఇష్యూలపై కేంద్ర ప్రభుత్వం  విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్-2024 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఇటీవలే ఈ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూకు సంబంధించి అనేక విషయాలు బయటికొస్తున్నాయి. తాజా మరో నిజం వెలుగులోకి వచ్చింది. యూజీసీ - నెట్ ఎగ్జామ్ పేపర్ టెలిగ్రామ్‌లో రూ.5వేల నుంచి 10 వేల రూపాయిలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. 

యూజీసీ నెట్-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. ఈ పరీక్ష రద్దు చేయడం అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయ కాదని ఆయన అన్నారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం డార్క్ నెట్‌లో లీక్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయినా ‘టెలిగ్రామ్’ ద్వారా ఈ పేపర్ లు షేర్ అయిన్లటు తమకు ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు.

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ నేపథ్యంలోనే యూడీసీ నెట్ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. ఇక ఈ ఘటనలో అవినీతికి పాల్పడిన, నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తామని అభ్యర్థులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు,కీలక అంశాలను తెలుసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కమిటీతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనానికే తొలి ప్రాధాన్యతనిస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.