అమానుషం.. కారును ఓవర్ టేక్ చేశాడని అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి
అంబులెన్స్ టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం అంబులెన్స్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాదారు.
కారును ఓవర్ టేక్ చేశాడని ఓ వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. ఈ అమానుష ఘటన బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిపై ఉన్న నేల మంగల టోల్ ప్లాజా వద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదునెలల బాలుడిని ఆక్సిజన్ సాయంత్రంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో అంబులెన్స్ టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం అంబులెన్స్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాదారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న బాలుడి తల్లిదండ్రులు దయచేసి వదిలేయండంటూ బతిమిలాడారు. అయినా వారు వినిపించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేసిన వారిని నెటిజన్లు కామెంట్లలో తిట్టిపోస్తున్నారు.