కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు

కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి.

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఢిల్లీకి  బయల్దేరారు. ఇవాళ సాయంత్ర్యం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఒకే కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. వారు ముందుగా ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సిట్లను సాధించిన ఎన్టీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

Read More రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య