భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి..!

భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి..!

 

కువైట్ లో జరిగిన ప్రమాదం
మరో 50 మందికి గాయాలు
గాయపడిన వారిలో 35 మంది భారతీయులే

 

గల్ఫ్ కంట్రీ అయిన కువైల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 41 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతుల్లో 40 మంది భారతీయులే కావడం మహా విషాదం నింపింది. ఓ అపార్టుమెంట్ లో చెలరేగిన మంటలు అంతకంతకూ పెరిగి చివరకు జనాల ప్రాణాలను హరించాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆ బిల్డింగులో దాదాపు 160 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కువైట్ అధికారులు తెలిపారు. 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నగరంలో ఉన్న ఓ బిల్డింగులో కార్మికులు నివాసం ఉంటున్నారు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేసేందుకు వివిధ దేశాల నుంచి అక్కడకు వెళ్లారు. అందులో మన ఇండియా వాళ్లే ఎక్కువ ఉన్నారని తెలుస్తోంది.

అయితే బుధవారం తెల్లవారు జామున కిచెన్ లో మంటలు చెలరేగి.. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. అప్పటికే ఆ బిల్డింగులో ఉన్న కార్మికులు అందరూ నిద్రలో ఉండటంతో.. ఎక్కువ మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మంటలకు భయపడి బిల్డింగ్ మీద నుంచి దూకడంతో వారు కూడా చనిపోయారు. 

మంటల్లో కాలిపోయి 35 మంది చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 6 మంది చనిపోయారు. మంటల్లో కాలడం వల్ల మరో 50 మందికి పైగా గాయపడ్డట్టు జాతీయ మీడియా తెలుపుతోంది. ఈ గాయపడ్డ వారిలో 35 మంది మన భారతీయులే ఉన్నారు. ఇక ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. కువైట్ లోని భారత్ రాయబారి ఘటనా స్థలాన్ని పరిశీలించారని.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.

Related Posts