పుష్పరాజ్ కు రామ్ పోతినేని పోటీ.. నిలబడతాడా..?
దేశ వ్యాప్తంగా ఇప్పుడు పుష్పరాజ్ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. బన్నీ హీరోగా వస్తున్న పుష్ప మొదటి పార్టు ఇప్పటికే పెద్ద హిట్ అయింది. దాంతో ఇప్పుడు పుష్ప-2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప-2ను ఆగస్టు 15న విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ గత మూడు రోజులుగా వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
పుష్ప ది రైజ్ ఎడిటింగ్ బాగా లేదని.. వీఎఫ్ ఎక్స్ సుకుమార్ కు నచ్చలేదని.. షూటింగ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని.. అందుకే మూవీ విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా వస్తున్నాయో లేదో.. అప్పుడే రామ్ పోతి నేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా పుష్పరాజ్ లాంటి పెద్ద సినిమాతో డబుల్ ఇస్మార్ట్ అసలు పోటీ పడుతుందా.. పోటీలో నిలబడుతుందా అని అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి అయి చాలా రోజులు అవుతున్నా.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేక ఆగిపోయారు. కానీ ఇప్పుడు పుష్ప-2 వాయిదా పడుతుందనే వార్తల నేపథ్యంలో ఇలా అనౌన్స్ చేశారు. కానీ ఒకవేళ పుష్ప-2 అదే డేట్ కు రిలీజ్ అయితే మాత్రం రెండు సినిమాలకు దెబ్బ పడుతుంది. ముఖ్యంగా పుష్ప సినిమా కలెక్షన్లు బాగా తగ్గిపోతాయని అంటున్నారు. మరి పుష్ప రాజ్ దెబ్బకు రామ్ పోతినేని నిలబడుతాడా లేదా అనేది చూడాలి.