రాజమౌళి పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన త్రిష

రాజమౌళి పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన త్రిష

 

రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలు అనుకునే స్టార్లు ఎంతో మంది ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేయాలని పెద్ద హీరోయిన్లు కూడా ఎదురు చూస్తుంటారు. అలాటిది రాజమౌళి పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇస్తే వద్దని చెప్పిందంట. ఆమె ఎవరో కాదండోయ్ సీనియర్ హీరోయిన త్రిష. 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

రాజమౌళి డైరెక్షన్ లో సునీల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న అప్పట్లో పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారంట రాజమౌళి. ఇన్నోసెంట్ క్యారెక్టర్ కాబట్టి త్రిష బాగా సూట్ అవుతుందని ఆయన భావించి ఆమెను అడిగారంట. అయితే రాజమౌళి సినిమా కాబట్టి త్రిష కూడా సంతోషించింది. 

కానీ సినిమలో కమెడియన్ సునీల్ హీరో అనే సరికి వద్దని చెప్పిందంట. ఎందుకంటే ఇన్నేళ్లు అగ్ర హీరోయిన్ గా రాణించిన తాను.. ఒక కమెడియన్ పక్కన చేస్తే ఇమేజ్ పోతుందని భావించి వద్దని సున్నితంగా రిజెక్ట్ చేసిందంట. ఆ తర్వాతనే సలోనిని హీరోయిన్ గా తీసుకున్నారు రాజమౌళి. అయితే మరోసారి రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెప్పింది.