అభిమాని ఆత్మహత్య.. సోనాలి బింద్రే రియాక్షన్ ఇదే..!

అభిమాని ఆత్మహత్య.. సోనాలి బింద్రే రియాక్షన్ ఇదే..!

  • నా కోసం ప్రాణాలు తీసుకోవడం బాధాకరం
  • నాకు రక్తంతో రాసిన లెటర్స్ వచ్చేవి
  • అలా ఎందుకు చేస్తారో అర్థంకాదు 
  • ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే

టాలీవుడ్‌లో ఎంతోమంది అగ్రహీరోలతో నటించిన హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సోనాలికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన ఈ హీరోయిన్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ఇటీవల కోలుకుని తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. పలు డ్యాన్స్‌షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 

అదేవిధంగా చాలా కాలం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్‌ -2లో సిరీస్‌లో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే తన ఫ్యాన్స్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. గతంలో ఓ అభిమాని సోనాలిని చూడలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని యాంకర్ తెలుపగా సోనాలిబింద్రే స్పందించింది. 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

‘‘నిజంగా ఈ సంఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదు. నన్ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడమనేది బాధాకరమైన విషయం. నాకు కొన్ని మెయిల్స్, లెటర్స్ వస్తుంటాయి. అందులోకొన్ని రక్తంతో రాసినవీ వచ్చేవి. ఒక మనిషి తనలాంటి మరో మనిషి కోసం ఎందుకంత తాపత్రయపడతారో నాకైతే అర్థం కావడంలేదు. నేను ఎవరినీ ఇంతలా అభిమానించలేదు’’ అని తెలిపింది.

Related Posts