ప్రియుడికి ఖరీదైన బహుమతి ఇస్తున్న శోభాశెట్టి..!

ప్రియుడికి ఖరీదైన బహుమతి ఇస్తున్న శోభాశెట్టి..!




బిగ్ బాస్ సీజన్-7 లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టి. బిగ్ బాస్ లో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రశాంత్‌, శివాజీ టీమ్ తో సై అంటే సై అన్న శోభాశెట్టి. శోభాశెట్టి ఇంతకు ముందు ప్రజలకు ఇష్టమైన కార్తీక దీపం సీరియల్‌ లో మోనిత అనే విలన్ పాత్రతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది శోభాశెట్టి. తద్వార బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.

బిజీబిజీగా ఉన్న శోభశెట్టి తన ఒంటరి జీవితానికి బై చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అతను ఎవరో కాదు తన ప్రియుడు యశ్వంత్ వీరి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు సమాచారం. శోభాశెట్టి తనకు కాబోయే భర్తకు కాస్టీలీ కారును పుట్టిన రోజుకు గిప్ట్ గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారు కొన్న శోభాశెట్టి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉన్న కారుని తన ప్రియుడుకి గిప్ట్ గా ఇచ్చింది శోభాశెట్టి. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శోభాశెట్టి పెళ్లికి ముందే తన ప్రియుడి కోసం ఇంత ఖర్చు పెడుతోంది ఏంటని అంతా షాక్ అవుతున్నారు.