ఆ హీరో నన్ను మోసం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

ఆ హీరో నన్ను మోసం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

 

ఈ మధ్య కొందరు హీరోయిన్లు హీరోలపై చేస్తున్న ఆరోపణలు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇలాంటి సంచలన ఆరోపణలు చేసింది. ఆమె 49 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందాలతో కుర్రాలను మాయ చేస్తుంది. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు చాలా కాలం దూరంగా ఉంది. 

ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని బు షోలలో జడ్జిగా చేస్తుంది. అయితే ఆమె తాజాగా హీరో అక్షయ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది. వీరిద్దరూ కలిసి అప్పట్లో మై కిలాడి తూ అనారి అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే కొంతకాలం తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. 

ఆ తర్వాత అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ తనను ప్రేమిస్తున్న సమయంలోనే ట్రింకిల్ ను కూడా ప్రేమించాడని.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని నటి శిల్పా శెట్టి ఆరోపిస్తోంది. ఆమె గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ కామెంట్లు చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts