శృంగారానికి వయసుతో సంబంధం లేదు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్లు
ఈ నడుమ హీరోయిన్లు ట్రెండ్ మార్చేస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి సినిమాలు దాదాపు బోల్డ్ గానే ఉంటున్నాయి. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టే హీరోయిన్లు కూడా మారిపోతున్నారు. మొన్నటి వరకు లిప్ లాక్ సీన్లు, ఇతర రొమాంటిక్ సీన్లు చేయని వారు కూడా ఇప్పుడు అలాంటి వాటిలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా సీనియర్ హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు హీరోయిన టబు. ఆమె యాభై ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. అయితే ఆమె తాజాగా బోల్డ్ సీన్లు చేయడంపై షాకింగ్ కామెంట్లు చేసింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ లో అయినా సరే నటించేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
సినిమా అన్న తర్వాత అన్ని సీన్లు చేయాలి. అది చేయను, ఇది చేయను అంటూ కూర్చుంటే అవకాశాలు రావు. ఒక నటిగా రాణించాలంటే అన్ని సీన్లు చేయాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్ లో బోల్డ్ సీన్లు చేస్తేనే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది. కాబట్టి అలాంటి సీన్లలో నేను నటించేందుకు అస్సలు వెనకాడను అంటూ చెప్పింది. అయితే ఆమె ఈ వయసులో కూడా అలాంటి సీన్లు చేస్తానని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.