బన్నీతో చేయొద్దని మా ఫ్యామిలీ కండిషన్ పెట్టింది: సమంత

బన్నీతో చేయొద్దని మా ఫ్యామిలీ కండిషన్ పెట్టింది: సమంత


పుష్ప ఐటెం సాంగ్ వద్దన్నారు
నా వృత్తి నాకు ముఖ్యం

 

సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఆమె చైతూతో విడాకులు పొందిన సమయం నుంచి ఆమె చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చైతూ గురించి అనేక కామెంట్లు చేసింది. ఎన్నో సార్లు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు మయోసైటిస్ వ్యాధి తీవ్రం కావడంతో మళ్ళీ విదేశాల్లో చికిత్స కోసం వెళ్ళింది.


ఇక అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బన్నీ మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అప్పట్లో ఆ సాంగ్ మీద పెద్ద విమర్శలు వచ్చాయి. సమంత విడాకులు తీసుకున్న కొద్ది రోజులకు చాలా వల్గర్ గా సాంగ్ లో రొమాన్స్ చేసిందని ఆమెను తిట్టి పోశారు. 

కాగా ఆ ఘటనపై ఆమె తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ నేను విడాకులు తీసుకున్న కొద్ది రోజులకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో ఐటెం సాంగ్ వద్దు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. బన్నీతో అని చెప్పినా వినలేదు. కానీ నాకు నా వృత్తి ముఖ్యం. అందుకే అందర్నీ ఒప్పించి ఆ సాంగ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. నేను విమర్శలు పట్టించుకోను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

Related Posts