రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: రాజమౌళి

రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి రామోజీరావు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి రామోజీరావు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఒక్క మనిషి అన్ని రంగాల్లో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని శిఖరాలకు తీసుకెళ్లిన గొప్పవ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారని, ఉపాధి కల్పించారని తెలిపారు. 

అలాంటి గొప్ప వ్యక్తికి ‘భారత రత్న’ ఇవ్వాలని కోరారు. అది ఆయనకు సముచిత స్థానమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు.

Read More బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

Tags: