బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించింది. 2019లో తాను ‘రక్షణ’ అనే సినిమాలో నటించానని.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల నిలిచిపోయిందని తెలిపింది.

టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించింది. 2019లో తాను ‘రక్షణ’ అనే సినిమాలో నటించానని.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల నిలిచిపోయిందని తెలిపింది. అయితే తన సక్సెస్‌ను చూసి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలిపింది. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, కానీ తన టీమ్‌ ఆ చిత్ర యూనిట్‌తో టచ్‌లో ఉందని తెలిపింది. 

తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో తన టీమ్‌ చెప్పినా, వారు మాత్రం చెల్లించేందుకు అంగీకరించలేదని రాసుకొచ్చింది. అయితే, అగ్రిమెంట్ ప్రకారం తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. తన ప్రమేయం లేకుండా ఆ సినిమాలో పేరు, పాత్ర ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పాయల్‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

ఇదిలా ఉండగా పాయల్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది మంగళవారం అనే సినిమాలో తన పాత్రతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఆ సినిమాలో పాయల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా తొలిసారి కనిపించనుంది. ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా మహతి సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. రోషన్, మానస్, రాజీవ్ కనకాల తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.

https://www.instagram.com/p/C7KJ27uKLlP/?igsh=MTZ5N216NXNsa2x1bA%3D%3D&img_index=1

Related Posts