బన్నీని అందుకే సాయితేజ్ అన్ ఫాలో చేశాడు.. నిహారిక క్లారిటీ
మొన్న ఏపీ ఎన్నికల్లో బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట చేయడంతో జనసేన, మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కు సపోర్ట్ చేయకుండా వెళ్లి వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే అప్పటి నుంచే మెగా ఫ్యామిలీ కూడా బన్నీని దూరం పెడుతూ వస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయితేజ్ బన్నీని ఆయన భార్య స్నేహను అన్ ఫాలో చేశాడు.
కాగా దానిపై తాజాగా నిహారిక స్పందించింది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీని వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ టీజర్ ఈవెంట్ నిర్వహించగా దానికి నిహారిక హాజరైంది.
ఆమెను సాయితేజ్ ఎందుకు అన్ ఫాలో చేశాడని మీడియా అడగ్గా స్పందించింది. ఎవరు ఎవరిని ఎందుకు అన్ ఫాలో చేస్తారో నాకు తెలియదు. మీరడిగే ప్రశ్నకు సంబంధించి నాకేం తెలియదు. అయితే అన్ ఫాలో చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అవేంటనేది నాకు తెలియదు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.