కల్కి ట్రైలర్ వచ్చేసింది.. లోకల్ కాదు.. హాలీవుడ్ రేంజ్..!
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ యుగాంతం నేపథ్యంలో ఉంటుందని ముందు నుంచే ప్రచారం జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సినిమాను తీశారు. జూన్ 27న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగామూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఇందులో ప్రభాస్ ప్రత్యేక పవర్స్ కలిగిన వ్యక్తిగా కనిపించాడు. కాశీ లోని చివరి గ్రామంలో ఇదంతా జరిగినట్టు చూపించారు. ట్రైలర్ ఆద్యంతం టోన్డ్ కలర్ లోనే సాగింది. ప్రభాస్ కటౌట్ ను కూడా బాగానే వాడుకున్నాడు దర్శకుడు. ఇందులో చాలా పాత్రలను చూపించలేదు. కొన్ని పాత్రలను మాత్రమే చూపించారు.
ట్రైలర్ లో ప్రభాస్ పాత్ర గూస్ బంప్స్ పెట్టించే విధంగా ఉంది. నా ట్రాక్ రికార్డు చూడు.. ఇప్పటి వరకు ఏ ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు.. అసలు ఇది తెలుగు సినిమానా.. లేకపోతే హాలీవుడ్ సినిమానా అనేలా ఉంది. మరి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.