సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం.. తల్లితో కలిసి పూజలు
సోనాక్షి సిన్హా పెళ్లిపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. అయితే దానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. అతను ఎవరో కాదు తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోబోతుంది. బాలీవుడ్ బ్యూటీ అయిన సోనాక్షి సిన్హా పెళ్లి అంటు సమాచారం జరుగుతుంది. మరోవైపు తన కుటుంబానికి సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సోనాక్షి సిన్హా పెళ్లి తన కుటుంబానికి ఇష్టం లేదని తెలుస్తోంది. తన తండ్రి శత్రఘ్న సిన్హాని ఆమె పెళ్లి గురించి అడుగుతే నాకు తెలీదు అని.. తన కూతురి పెళ్లికి తనకే ఆహ్వానం లేదని కామెంట్ చేసాడు. దీనితో రకరకాల వార్తలు వస్తూన్నాయి. సోనాక్షి సిన్హా తన కుటుంబానికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు అన్నింటికి ఫుల్‌స్టాప్ పడింది తన ఇంట్లోనే తన పెళ్లి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి.
తన పుట్టింట్లో తన తల్లితో వివాహానికి ముందు జరిగే పూజలు చేసింది సోనాక్షి సిన్హా. పుట్టింట్లో పెళ్లి కూతురుగా ముస్తాబు అయిన సోనాక్షి సిన్హా పెళ్లి, రిసెప్షన్‌కి వేడుకలకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ను ఏర్పాటు చేసారు. వధూవరుల పెళ్లి బట్టలు శత్రఘ్న సిన్హా ఇంటికి వచ్చాయి. మొత్తనికి సోనాక్షి సీన్హా తన కుంటుంబ సభ్యుల సమక్యంలో పెళ్లి జరగబోతుంది. ఆమె పెళ్లి పై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టుయ్యింది
సోనాక్షి సిన్హా మెహెందీ వేడుకలు సైలెంట్ గా జరిగిన దీనికి సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. సోనాక్షి-జహీర్‌ల కామన్ ఫ్రెండ్స్ జాఫర్ అలీ మున్హీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. సోనాక్షి, జహీర్ వివాహం కన్‌ఫాం అవడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. వీరి పెళ్లి జూన్ 23 న వీరి ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది..