‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప’
- రవితేజ ఫొటో షేర్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్
- మాస్ మహారాజ ఫన్నీ రిప్లై
- శరవేగంగా ’మిస్టర్ బచ్చన్’ సినిమా షూటింగ్
టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన ఈ డైరెక్టర్ మాస్ మహారాజ్ రవితేజతో మూడు సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు.
‘మిస్టర్’ బచ్చన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సాంగ్ షూటింగ్‌లో రవితేజని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప. కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్ లో దిగుతాము” అని హరీష్ శంకర్ రాసుకొచ్చాడు.
హరీష్ శంకర్ ట్వీట్ కి తాజాగా రవితేజ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘‘ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది’’ అని తన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. దీంతో రవితేజ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన రవితేజ ఫ్యాన్స్ వీళ్లిద్దరి బాండింగ్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ‘రైడ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Over cheyaku roiiiii ..
— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024
Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP