క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ వీడియో..!!

క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ వీడియో..!!

  • చరణ్-ఉపాసన దంపతుల కూతురు క్లిన్ కారా
  • బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్ చేసిన ఉపాసన

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు గతేడాది (జూన్ 20న) సరిగ్గా ఇదే రోజు పాప పుట్టింది. ఆ పాపకు క్లిన్ కారా అని నామకరణం చేశారు. అయితే, క్లిన్ కారా ఫస్ట్ బర్త్‌డేను మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన  సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. క్లిన్ కారా తమ కుటుంబంలోకి అడుగుపెట్టాక అందరూ ఎంత సంతోషించారో అభిమానులతో పంచుకుంది. 

ఉపాసన డెలివరీ సమయంలో ఈ వీడియోను తీశారు. అప్పుడు కూడా ఉపాసన ఇదే వీడియోను షేర్ చేసింది. మొదటి జన్మదిన సందర్భంగా ఆమె ఈ వీడియోను మళ్లీ షేర్ చేసింది. సెలబ్రిటీలతో పాటు మెగా అభిమానులు కూడా క్లిన్ కారాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు “మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా డార్లింగ్ క్లిన్ కారా కొణిదెల. మా జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ వీడియోని మిలియన్ సార్లు చూశాను. @ ఈ జ్ఞాపకాలను సంగ్రహించినందుకు @josephradhik & టీమ్‌కి ఎల్లప్పుడూ రామ్‌చరణ్ ధన్యవాదాలు”. అని పోస్ట్ చేసింది.

Read More సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్టీ ఎమ్మెల్యేలు

https://www.instagram.com/reel/C8aRY5BSlnw/?utm_source=ig_embed&ig_rid=a49fabbe-7447-4dfc-8cfc-01dd12120f8c